| << Newer | Post Comments | Older >> |
.
తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో అతి కీలకమైన ముస్లిం సోదరుల ఓటు కాంగ్రెస్ పార్టీకే దక్కినట్లు ఫలితాలను బట్టి అర్థం అవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంటే ముస్లిం సోదరులు కూడా తెలంగాణాను కోరుకోంటూ ఉంటే వారి ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పడాలి. అయితే ఫలితాలను పరిశీలిస్తే అలా జరగలేదని తెలుస్తుంది. కేవలం ఒక్క ఖైరాతాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం లోనే టి. ఆర్. ఎస్. కాంగ్రెస్ పార్టీకి పోటీగా తన పార్టీ ముస్లిం అభ్యర్థిని రంగం లోకి దించింది. తెలంగాణ లోనే మిగిలిన నియోజక వర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎంపిక చెయలెదు.కన్గ్రెస్ పార్టీకి ముస్లిం ల పై బలమైన పట్టు ఉంది. ఈ విషయాన్ని కె. సి. ఆర్ గ్రహించి నట్లు లేదు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తున్న ముస్లింలను కె. సి. ఆర్ విస్మరించడం తో వారు కూడా ఆయన గురించి ఆలోచించలేదని అనుకోవాలి. ఆ కారణంగానే వారు తెలంగాణకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పాక తప్పదు .ముస్లింల మద్దతును కూడా గట్టుకోవడానికి కె. సి. ఆర్. ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అర్థం అవుతుంది. అన్ని వర్గాల మద్దతు లేకుండా తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచడం సాధ్యం కాదు. ముస్లింల మద్దతుకు ఇప్పటికైనా కె. సి. ఆర్ . నడుం బిగించాలి


