| << Newer | Older >> |
on 2008/7/18 19:15:13
డిల్లీ రాజకీయాలు క్లైమ్యాక్స్ కు చేరింది. విశ్వాస పరీక్షకు గడువు సమీపిస్తున్న కొద్ది దేశరాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీ కి చెందిన చంద్రబాబు నాయుడు, తెలంగాణా ప్రాంతానికి చెందిన టి. ఆర్. ఎస్. నేత కె. సి. ఆర్. లు ఇపుడు డిల్లీ లో చక్రం తిప్పుతున్నారు. వీరిద్దరికి కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలున్న ఇద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే. యు. పి. ఏ. ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికిగాను ఇద్దరు డిల్లీ లో కూర్చొని రాజకీయాలు నడుపుతున్నారు. కె. సి. ఆర్. శుక్రవారం రాత్రి డిల్లీ చేరుకొని నేరుగా అజిత్ సింగ్ ఇంటికి వెళ్ళి ఆయనతో మంతనాలు జరిపారు. అజిత్ ఆహ్వానం పై ఆయన డిల్లీ కి వెళ్లారు. అజిత్ ను కలిసి మాయావతి సందేశాన్ని ఆయనకు చేరవేశారు. మాయావతి తో కలిసి ముందుకెళ్ళాలని సూచించారు. అజిత్ కూడా తన డిమాండ్లను కె. సి. ఆర్. కు వివరించారు. అజిత్ డిమాండ్ లు గురించి కె. సి. ఆర్. మాయావతి కి శనివారం వివరించవచ్చు. నాలుగేళ్లలో మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కె. సి. ఆర్. డిల్లీ లో తన పరపతిని పెంచుకోడానికి ఇపుడు విశేషంగా కృషి చేస్తున్నారు
ఇక తేలుదేశం పార్టీ అదినేత చంద్రబాబు కూడా శనివారం డిల్లీకి వెళ్ళి మాయావతి తో మంతనాలు జరపనున్నారు. యు. ఎన్. పి. ఏ. కూటమి లోకి మాయావతిని ఆహ్వానించి ఆమె ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలిపే విషం పై చర్చించ నున్నారు. వామపక్ష జాతీయ నేతలతో సమావేశాలు జరిపి విశ్వాస పరీక్షలో యు. పి. ఏ. ఓటమికి వ్యూహ రచం ఆచేయనున్నారు. వామపక్షాల్టో మారిత సన్నిహితంగా మెలుగుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల్టో పొత్తుకు కృషి చేస్తున్నారు. ఇక మాయావతి తోనూ పొత్తుకు డిల్లీ లో బీజం పదే అవకాశం ఉంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



