| << Newer | Post Comments | Older >> |
అణు ఒప్పందం పై ఎవరికి ఎలాంటి సందేహాలున్న వాటిని నివృత్తి చేస్తామని, వామపక్షాల అభ్యంతరాలకు కూడా సమాధానం చెబుతామని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. డిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఆ తరువాత మీడియా సమావేశంలో ప్రసంగించారు. అణు ఒప్పందం కుదిరిన తరువాత ఆ అంశాన్ని పార్లమెంట్ ముందు చర్చకు పెట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో చర్చ తరువాతనే అణు ఒప్పందాన్ని అమలు పరచనున్నట్లు స్పష్టం చేశారు. ఐ. ఏ. ఈ. ఏ, ఎస్. ఎస్. జి. లతో ముందు చర్చజరగా నివ్వాలని ప్రధాని ప్రతిపక్షపార్టీలను కోరారు.


