| << Newer | Older >> |
on 2008/6/13 22:39:42
లేట్ అయిన లేటెస్ట్ గా ఉండాలని ఆయన భావన. అందుకే ఆలస్యం చేసినా ప్రజలు ఎంతో సహనం తో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి పార్టీ రైలు ప్లాట్‌ఫారం పైకి దూసుకొని రావడానికి సిద్దం అవుతోంది. చాప కింద నీరులా పార్టీ పని చేస్తోంది. అన్ని అనుబంధ సంఘాల తో పార్టీ సన్నద్డ మైంది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఒక్కటే మిగిలింది. ఈ లోగా చిరంజీవి రాజకీయ రంగా ప్రవేశానికి సంబందించి ఒక్కో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా చిరు పార్టీ తీరుతెన్నులు, ఆ పార్టీ వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలు గురించి వివరించే పాటల సి. డి. ఒకటి మీడియాకు చిక్కింది. ఆరు పాటలతో కూడిన ఈ సి. డి. లో చిరు పార్టీ గురించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలనను అందివ్వాలన్న మెగాస్టార్ ఆశయాలు ఆ పాటల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఎస్. పి. సుబ్రమణ్యం పాడిన ఆరు పాటలు చిరు అభిమానులను విపరింతంగా ఆకట్టు కుంటున్నాయి. స్వచ్ఛమైన, అవినీతి, ఆశ్రిత పక్ష పాలనకు తావులేని పాలనను అందిస్తామన్నపాటచిరంజీవి అంతరంగాన్ని తెలిపే పాటలుపాటఆ సి. డి. లో ఉన్నాయి. చిరు తొలిచిత్రం పునదిరాళ్ల నుంచి ఠాగూర్ వరకు ఆయన నటించిన చిత్రాల్లోని పాత్రలను విశ్లేషిస్తూ ఆ చిత్ర విజయాల వెనుక చిరంజీవి పడిన కష్టాన్ని వివరిస్తూ రాసిన ఒక పాట కూడా ఉంది. పేదలు, అణగారిన వర్గాల జీవితాలలో చిరు దీపం లా ఉండాలన్న మెగాస్టార్ ఆశయాన్ని తెలిపే మరో పాట ఉంది. బావోద్వేగాన్ని లోను చేసే ఆ పాటల్లో వాడిన పదాలు, భావావేశాన్ని రగిల్చే బాణీలు అందరినీ ఆకట్టుకోవడం ఖాయం. ఇక చిరు పార్టీ కార్యాలయం కూడా సర్వంగసుందరంగా ముస్తాబవుతోంది. 45 రోజుల్లో కార్పొరేట్ రంగాన్ని తలపించేలా చిరు పార్టీ కార్యాలయాన్నినిర్మించారు. డ్యూప్లెక్స్ తరహాలో నిర్మించిన భవనం లో కింద విశాలమైన కాన్ఫరెన్స్ హాల్, 8 గదులు ఉన్నాయి. పై అంతస్థులో ఒక కాన్ఫరెన్స్ హాల్, చిరంజీవి కోసం ఒక ప్రత్యేకమైన గదిని నిర్మించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



