| << Newer | Post Comments | Older >> |
పులివెందులలో ఐనా పోటీ చేసి గెలుస్తానని చిరంజీవి ప్రకటించటం అప్పుడే రాజకీయ దుమారాన్ని రేపుతుంది. పార్టీ ప్రకటన చేయటానికే వారాలు, తిధులు చూసుకునే నటుడు ప్రజాసేవ చేస్తానని ప్రకటించటమే ఓ విడ్డూరాం అంటున్నారు ఈయన అంటే పడని రాజకీయ , సినీ పక్ష నాయకులు. అంటే కాదు.. పులివెందుల రాజకీయాలు ఏమీ తెలుసు అని వై ఎస్ మీద పోటీ చేస్తానని చిరు ప్రకటించాడు.వై ఎస్ మీద దాకా ఎందుకు... నరసాపురం నియోజక వర్గం
లో పోయి చేసి గెలువమనన్డి. ఎందుకు అంటే ఆది ఆయన సొంత నియోజక వర్గం కదా.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక టి డి పి నాయకులు ఐతే ఒక అడుగు ముందుకు వేస్తున్నరు. చిరంజీవి పార్టీ లో కి ఎక్కువ మంది నాయకులు వెళ్ళిన ఆక్రోసమో ఏమో కానీ, చిరు అంటేనే మంది పడుతున్నారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. మొగల్తూరు లో నే ఆయన అంటే ఎక్కువ మందికి అసహ్యం అంటూ మొదలు పెట్టి నరసాపురం కాలేజీ అభివృద్ది కోసం నిధుల సేకరణ లో భాగంగా చిరు ను కలిస్తే పది వేలు ఇచ్చి అవమానించిన సంగతి అక్కడకు వెళ్ళి ఎవరిని అడిగినా చెబుతారని
చెబుతున్నారు.
చిరు ప్రకటన వెనుక ఎవరు ఉన్నారనే అంశం పక్కన పెట్టి వివాదాలకు దూరంగా ఉండే చీరుల ప్రకటన చేయటం చాలామందిని చకితుల్నిచేసింది. అప్పుడే చిరుకు రాజకీయాలు వంటాపట్టేసాయని కొంత మంది అంటుంటే... అబ్బే... అనుభువాలేమీ ఇలా మాట్లాడించింది అని కొంతమంది విశ్లేషిస్తున్నారు.


