| << Newer | Post Comments | Older >> |
ప్రజారాజ్యం పార్టీ అదినేత చిరంజీవి పై ఎస్. సి. , ఎస్. టి. కేసు నమోదు అయింది. చిరంజీవి పై కేసు నమోదు చేసి డిసెంబర్ 29 వ తేదీలోగా విచారణ జరిపి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని వరంగల్ కోర్ట్ కాజీపేట పోలీసులకు సూచించారు. ప్రజా అంకిత యాత్రను చిరంజీవి తెలంగాణా ప్రాంతం లో నిర్వహిస్తున్న సమయం లో వరంగల్ వచ్చినపుడు రాజేందర్ అనే వక్తి ని చిరంజీవి కాన్వాయిలోని ఒక కారు ఢీ కొనింది. తన కాలు పై నుంచి ఆ వాహనం వెళ్ళిందని రాజేందర్ కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు కోర్ట్ లో విచారణకు వచ్చింది. దానిపై వరంగల్ కోర్ట్ స్పందించింది.


