| << Newer | Older >> |
on 2008/5/10 7:52:11
మెగాస్టార్ సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో గా గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు ఆరవింద్ నిర్మించిన ' జల్సా చిత్రం మొదటి మూడు వారాల్లో ఎంత వసూలు చేసింది అన్నది ఇప్పిటికి సస్పెన్స్ గానే ఉంది. ఆ చిత్రం విదులైన మొదటి మూడు వారాల్లో 40 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మొదటి మూడు వారాల్లో 30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు ఈ చిత్ర యూనిట్ బావిస్తోంది. జల్సా చిత్రంవాస్తవంగావాస్తవంగా ఎంత వసూలు చేసింది అన్న దానికి సంబందించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. తమ అభిమాన హీరో నటించిన చిత్రం వసూళ్లను గురించి అభిమాన సంఘాలు గొప్పగా చెప్పడం సర్వ సాదారణంగా జరిగే విషయమే. ప్రస్తుతానికి జల్సా చిత్రం ఐదో వారం నడుస్తోంది. పలు ప్రాంతాల్లో ఆ చిత్ర కలెక్షన్లు బాగా తగ్గాయి. ఐ. పి. ఎల్. నిర్వహిస్తున్న ట్వంటి ట్వంటి క్రికెట్ మ్యాచ్ ల ప్రభావం వల్ల జల్సా సినిమా కలెక్షన్స్ తగ్గినట్లు కొందరు అభిమానులు చెబుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




