| << Newer | Post Comments | Older >> |

రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి మంగళవారం డిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అదినేత్రి ఆదేశాల మేరకు ఆయన డిల్లీ కి వెళ్ళి సోనియాగాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవనున్నారు. అదే సమయంలో ఆయన ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణా విషయం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ఆదిష్టాన వర్గం ఆలోచిస్తున్నట్లు జరుగుతున్న ఉహాగానాల నేపథ్యం లో ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన ప్రధాన్యతను సంతరించుకుంది. డిల్లీ లో ఈ నెల 26 న కోర్ కమిటీ సమావేశం జారుతుందని ఆ సమావేశం లో తెలంగాణా అంశం పై చర్చ జరుగుతుందని జోరుగా ప్రచారం జరగడం, తరువాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మాట్లాడుతూ కోర్ కమిటీ సమావేశం ఉండక పోవచ్చునని, తెలంగాణా అంశం లో కూడా ఏకాభిప్రాయం కుదరని కారంనగా ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని చెప్పిన విషయం తెలిసిందే. తెలంగా పై పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి సాంకేతిక సమస్య కూడా ఎదురు కానున్న దృష్ట్యా బిల్లు పెట్టె అవకాశం కూడా లేదు. పోతే తెలంగాణా పై మాత్రం చర్చ జరగ నుందని, ఆది ఏ రూపం లో చర్చ ఉంటుందన్నది తేలాల్సి ఉంది.


