| << Newer | Older >> |
on 2008/10/4 13:39:53
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన తొలి రాష్ట్ర పర్యటనను శ్రీకాకుళం నుంచి ప్రారంభించనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ లో చిన్న మార్పు జరిగింది. ముందుగా అనుకున్నట్లు ఆయన ఇచ్ఛాపురం నుంచి పర్యటనను మొదలు పెట్టాల్సి ఉంది. అయితే సమయం చాలక పోవడం తో పాటు శ్రీకాకుళం వచ్చి అక్కడి నుంచి అరసవిల్లి కి వెళ్ళి సూర్యనారాయణ భగవానునికి పూజలు జరిపి తిరిగి ఇచ్ఛాపురం వెనక్కు వచ్చి టూర్ ను మొదలు పెట్టడం అంటే దాదాపు ఆరు నుంచి ఏడు గంట సమయం పడుతుంది అంత సమయం వృద కాకూడదనుకున్న చిరంజీవి తన టూర్ షెడ్యూల్ ను స్వల్పంగా మార్చడానికి అంగీకరించారు. మారిన దాని ప్రకారం ఆయన శ్రీకాకుళం చేరు కొని అక్కడి నుంచి అరస విల్లి కి వెళ్ళి పూజలు జరిపి శ్రీకాకుళం నుంచి తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం చిరంజీవి శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడి నుంచి అరసవిల్లి వెళ్ళి పూజలు నిర్వహించి తిరిగి శ్రీకాకుళం చేరుకుంటారు. శ్రీకాకుళం పట్టణం నుంచి యాత్రను మొదలు పెట్టనున్నారు. తొమ్మిది. పది తేదీల్లో చిరంజీవి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం, నరసన్న పేట, టెక్కిలి, కశీబుగ్గా, సోంపేట మీదుగా 11 వ తేదీకి ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. ఇక 13 వ తేదీన చిరంజీవి విజయనగరం జిల్లాలో అడుగు పెట్టనున్నారు. విజయనగరం లో 13 వ తేదీన సిరిమను పండుగ జరగనుంది. ఆ పండుగ లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. దాంతో చిరంజీ పర్యటన సాగడానికి కొంత ఇబ్బంది ఉంది. మరో మార్గం లో ఆయన యాత్ర చేపట్టేలా చూడటానికి మార్గాన్ని అన్వేషిస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



