| << Newer | Older >> |
on 2008/7/14 8:48:24
లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ తన స్పీకర్ పదవికి రాజీనామా చేసి వైదొలుగుతారని ప్రచారం జరిగింది. ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి అయితే ఆయన మాత్రం రాజీనామా చేయలేదు. స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని సి. పి. ఎం పార్టీ నుంచి ఆయనపై వత్తిడి పెరిగింది. స్పీకర్ పదవీతోపాటు తన పార్లమెంట్ సభ్యత్వానికికూడా రాజీనామా చేస్తానని సోమ్‌నాథ్ తేల్చి చెప్పారని సమాచారం. విశ్వాస పరీక్ష రోజున ప్రతి వోటు కూడా చాల విలువైనది. స్పీకర్ ఓటు ఎంతో అవసరమైతే తప్ప పరిగణన లోకి తీసుకోరు. స్పీకర్ తో రాజీనామె చ్యంచడానికి సి. పి. ఎం పార్టీ పార్టీ కురువృుద్దుడు జ్యతిబసు సాయాన్ని అర్థించారు. జ్యోతిబసు స్పీకర్ణి కలవడానికి ముందు ఆయనను కేంద్ర మంత్రి ప్రణబ్ముఖర్జీ కలిశారు. సోమ్‌నాథ్ స్పీకర్ పదివిలో కొనసాగేలా చూడాలని ప్రణబ్ కూడా జ్యోతిబాసును కోరినట్లు తెలిసింది. ఇక ప్రణబ్ కూడా సోమవారం సోమ్‌నాథ్ ను కలిశారు. సోమవారం రాత్రి వరకు సోమ్‌నాథ్ తన పదవికి రాజీనామా చేయలేదు. పదవిని రాజీనామా చేయడానికి సోమనాథ్ సుముఖంగా లేదని తెలిసింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




