| << Newer | Older >> |
on 2008/9/15 6:19:50
స్పీకర్ సురేష్ రెడ్డి వ్యవహార శైలి ని టి. డి. పి. సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వర రావు తప్పు పట్టారు. స్పీకర్ సురేష్ రెడ్డి పై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం లో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా సురేష్ రెడ్డి అంటే తనకు గౌరవముందని, సురేష్ రెడ్డి చాలా మంచి వారని, సురేష్‌రెడ్డిని తాను గాని తమ పార్టీగాని విమర్శించడం లేదని అన్నారు. స్పీకర్ మంచివారు అని ఆయనకు రాజేశ్వర రావు క్లీన్ చిట్ ఇచ్చినపుడు ఇక ఆయన పై ఆవిశ్వాసం ఎందుకు పెట్టారు అని శాసన సభ వ్యవహారాల మంత్రి రోశయ్య చెన్నమనేనిని అడిగారు. స్పీకర్ గా ఆయన వ్యవహార శైలిని మాత్రమే తాము తప్పు పడుతున్నామని చెన్నమనేని మరోసారి వివరించారు. స్పీకర్ స్వంత్రంగా వ్యవహరించాలని, అయితే స్పీకర్ సురేష్ రెడ్డి పాలక పక్షానికి అనుకూలంగా ఉంటూ స్పీకర్ పదవి కే మచ్చ తీసుకొచ్చారని అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



