| << Newer | Older >> |
on 2008/7/23 22:01:34
లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీని ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కలిసి తన సాంఘీబవాన్ని తెలిపారు.. సి. పి. ఎం. పార్టీ సోమ్‌నాథ్ ను పార్టీ నుంచి వెలివేసిన నేపథ్యం లో ప్రధాని ఆయనను కలవడం ప్రదాన్యతను సంతరించుకుంది. నిన్నటి నుంచి సోమ్‌నాథ్ ను పలువురు నేతలు కలిపి తమ సంగీబావాన్ని తెలిపారు. 60 ఏళ్లుగా పార్టీ లో ఉంటూ మంచి పార్లమెంతేరీయన్ గా గుర్తింపు పొందిన స్పీకర్ సోమ్‌నాథ్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం పై మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఇక సోమ్‌నాథ్ పార్టీ కి దూరమైనట్లే చెప్పుకోవాలి. పార్టీ నిర్ణయానికి బి న్నంగా సోమ్‌నాథ్ వ్యవహరించారు. స్పీకర్ పదవికిరాజినామా చేయాలన్న పార్టీ ఆదేశాలను ఆయన లెక్క చేయలేదు. పార్టీ కురు వృద్దుడు జ్యోతిబసు చేసిన సూచనను కూడా సోమ్‌నాథ్ పట్టించుకోలేదు. స్పీకర్ పార్టీలకు అతితుడని ఆయన వాదిస్తూ వచ్చారు. లోక్‌సభ ప్రత్యేక సమావేశానికి స్పీకర్ గా వ్యవహరించారు. దాంతో పార్టీ ఆయనను వెలి వేసింది. స్పీకర్ ఇపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




