| << Newer | Post Comments | Older >> |
స్పష్టం కాని కాంగ్రెస్ వైఖరి
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం తన ఒక రోజు రాష్ట్ర పర్యటనలో తెలంగాణ అంశం గురించి ప్రస్తావిస్తారని తెలంగాణ కాంగ్రెస్ ప్రాంత నాయుకుల ఎంతో ఆశ పడ్డారు అయితే సోనియా గాంధీ మాత్రం ఆ ముచ్చటా ఎత్తకుండా ఇతర అంశాలను ప్రస్తావించి వెళ్ళి పోయారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది గురించి, పథకాల గురించివివరించి ఇతర పార్టీలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పై విమర్శాలకే పరిమితం అయ్యారు. ఎరువుల కొరత, అధిక ధరలు గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. సోనియా తెలంగాణ అంశం గురించి సానుకూలంగా మాట్లాడుతారని చూసిన వారికి నిరాశ ఎదురైంది. మిగిలిన రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ కు తాము అనుకూలమని చెప్పడమే కాదు ఆ అంశానికి అధిక ప్రదన్యతను ఇస్తూ సమయం దొరికినప్పుడెళ్ల తెలంగాణ వాదాన్ని వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఉసు ఎత్తడం లేదు. సోనియా పర్యటనకు ముందు పి. సి. సి. నేత డి. శ్రీనివాస్ కూడా సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారని పరోక్షంగా చెప్పారు. ప్రణబ్ సారథ్యం లోని త్రిసభ్య కమిటీ కి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ పై తమ అభిప్రాయాన్ని తెలుపుతూ లేఖలు సమర్పించినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ లేఖను ఇవ్వలేదు. ఇక రెండో ఎస్. అర్.సి గురించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడం చూస్తే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయం లో ఒక నిర్ణయానికి రాలేదని చెప్పాలి.
తెలంగాణ విషయం లో ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ కీర్తి టి. ఆర్. ఎస్. కు దక్కుతుందని. దానివల్ల్ కాంగ్రెస్ కు ఎలాంటి లాభం ఉండదన్న వాదన కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ అంశం ముచ్చటించి తెలంగాణ ఓట్లు కొల్ల గట్టాలన్నది కూడా ఆ పార్టీ వ్యూహం కావచ్చు. అయితే ఈ లోగా మిగిలిన పార్టీలు తెలంగాణ పై నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆతరువాత కాంగ్రెస్ పార్టీ సానుకూల నిర్ణయం తీసుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బవిస్థున్నరు.కన్గ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకొని పక్షం లో తెలంగాణ ప్రాంతం లో తమ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ ఖాయమని వారు అంటున్నారు.


