| << Newer | Older >> |
on 2008/6/25 22:15:54
రాష్ట్రం లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికల గురించి ముఖ్య మంత్రి వై. ఎస్. , సోనియాగాంధీని గురువారం కలిసి చర్చించనున్నట్లు సమాచారం. టి. ఆర్. ఎస్ కు చెందిన 16 మంది, ఎం. ఎల్. ఏ. లు, నలుగురు లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి కోరి కొని తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి సాదించిన ఫలితాల పై వై.ఎస్. తమ అధినేత్రి కి సమగ్రంగా వివరించనున్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్లు అందరు టి. ఆర్. ఎస్. పై పోటీకి దిగడం మంచిది కాదని, బలంగా ఉన్న తెలంగాణా సెంటిమెంట్ ముందు పార్టీ దెబ్బ తింటుందని చెప్పిన తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులే తమకు శ్రీరామ రక్ష అని బావించి పోటీ చేసి మంచి ఫలిూతాలు సాదించినట్లు ఆయన సోనియాగాంధికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. గతం లో ఎన్నడు గెలవని సీట్లను కూడా ఈ సారి గెలిచామని వై. ఎస్. సోనియాకు వివరించ నున్నారు.ఇక మంత్రి వర్గ విస్తరణ పై కూడా ఆయన సోనియాతో ప్రస్తావించే వీలుంది. అణు ఒప్పందం పై నిన్న జరిగిన సమావేశాలు తాజా పరిస్థితి పై కూడా వారు చర్చించనున్నారు. ఒక వేళ ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తే దానికి సిద్దంగా ఉండాలని సోనియా వై. ఎస్. ను ఆదేశించే అవకాశాలు ఉనాయి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




