| << Newer | Post Comments | Older >> |
ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రనక్కరలేదని , రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శుక్రవారం ఒక ప్రైవేట్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిరంజీవి లాంటి ప్రజాదరణ గల నటుడు తలుచుకుంటే సమాజాన్ని మార్చడం పెద్ద కష్టం కాదని చెప్పారు. మదర్ థెరిస ఇచ్చిన స్పూర్తి తో తాను ప్రజాసేవ చేస్తున్నాని పలు సందర్భాల్లో చిరంజీవి చెబుతువచ్చారని ఆమె ను స్పూర్తిగా తీసుకొన్న చిరు రాజకీయాల్లోకి రాకుండానే ప్రజాసేవను కొనసాగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పదవిలో ఉండటం వల్లనో, అధికారం చేజిక్కించుకొనో ప్రజాసేవ చేయాలనుకునేవారికి అవి అడుగడుగున అడ్డంకులు కల్పిస్తాయని సేవ చేయడానికి పదవి అడ్దంకిగా మారుతుందని ఆయన అన్నారు.
రాజకీయాలు కుళ్ళి పోయాయి
ప్రస్తుతం రాజకీయాలను పరిశీలిస్తే అవి కుళ్ళి కంపు కొడుతున్నాయని తమ్మ రెడ్డి చెప్పారు. రాజకీయ పార్టీలు గాని, రాజకీయ నాయకులు గాని ప్రజలకు ఎం చేస్తున్నారు. సమాజం లో ఎలాంటి మార్పులు తీసుకొని వస్తున్నారు అని ఆలోచేస్తే అంత శూన్యం గా కనిపిస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను తిలకిస్తే మన రాజకీయాలు ఎంత బాగా నడుస్తున్నాయో అర్థం అవుతుందని వ్యంగ్యంగా అన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూస్తుటే దానంత దరిద్రం మరొకటి ఉండదని పేర్గొన్నారు. ప్రజల జీవన గమనాన్నీ మార్చడానికో, సమాజాన్ని అభివృద్ది చేయడానికో రాజకీయాలు ఉపయోగ పడటం లేదు. వ్యక్తిగత విమర్శలు ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా మారిందని వాపోయారు. ఇవన్ని చూశాక ప్రజా సేవ చేయడానికి పదవి అక్కరలేదని. పదవుల్లో ఉండి చేసే సేవ కన్నా పదవుల్లో లేకుండానే ఎక్కువ చేయవచ్చునని సూచించారు. ప్రజలకు సేవకులు కావాలి. సేవ చేసే వారే సేవకులు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు రాజకీయం అంటే ఒక రక మైన అలర్జీ అని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేయాలని ఏ పార్టీ కొరినా, టికెట్టు ఇస్తామని చెప్పినా తాను తిరస్కరిస్తానని తెలిపారు. రాజకీయ రొచ్చును క్లీన్ చేసి స్వచ్ఛమైన రాజకీయం అందాలంటే రాజకీయాల్లోకి రాకుండా ఆ కుళ్ళు ను కడగ డానికి ప్రజలను చైతన్యం పరచడం ద్వారా సాదించవచ్చునని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు


