| << Newer | Post Comments | Older >> |
ప్రత్యేక ఆర్థిక మండలి (సేజ్) పేరిట ప్రభుత్వం పేద ప్రజల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఘాటుగా విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జెడ్ చెర్ల నియోజకవర్గ పరిది లోని పోలేపల్లి లోని సేజ్ బాధితులను పరామర్శించడానికి ఆయన శుక్రవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితులను నేరుగా కలుసుకొని వారిని పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారు చెప్పిన విషయాలు విని చలించి పోయారు. పేదలు త్యాగాలు చేస్తే పెద్దలు అనుభవిస్తున్నారని ఇదెంత శోచనీయమని చిరంజీవి అన్నారు. పెద్దలు త్యాగాలు చేసి ఫలితాన్ని పేదలకు అందివ్వాలని సూచించారు. సెజ్‌ల పేరిట పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం తీరు గమనిస్తే ఆ భూముల్లో రియాల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీస్తోందా అన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు నేరుగా రైతుల వద్దకు వచ్చి భూములను కొనుగోలు చేయడానికి బదులు, ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడం పలు అనుమానాలకు తావు ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఈ వైఖరిని ఎం అంటారో నాకన్నా మీకే బాగా తెలుసు అని చిరంజీవి అనగానే ప్రజల నుంచి బ్రోకర్ పాత్ర అని పెద్దగా వినిపించింది.
పేద ప్రజలను దోచుకొని పెద్దలను పోషిస్తున్న ప్రభుత్వ పాత్ర కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. నేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకున్నామని, సేజ్ బాధితులకు పరిహారాన్ని చెల్లించామని , వేదికలెక్కి ప్రసంగాలు చేస్తున్న నేతలకు చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు, సేజ్ పుణ్యమా అని ఒకనాటి అసాములు ఇపుడు భూములు కోల్పోయి బీకారు లయ్యారని ఇవేవీ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. సెజ్‌ల పేరుతో భూములను కోల్పోయిన వారందరు పేదలు, ఎస్. సి. , ఎస్. టి. , బి. సి. లే తప్ప పెద్దలు కాదని వారి భూమి ఒక సెంటు కూడా పోలేదని చెప్పారు. పోలేపల్లి అధ్యయన యాత్ర కూడా విజయవంతం కావడం తో ప్రజారాజ్యం పార్టీలో ఆనందం వెల్లివిరుస్తోంది.


