| << Newer | Older >> |
on 2008/10/11 8:07:47
తమతో పొత్తు కోరుకో దలుచుకుంటే ఈ నెల 14 వ తేదీలోగా చర్చలు జరపాలని సి. పి. ఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పెట్టిన ష రత్తు కు స్పందించిన ప్రజారాజ్యం పార్టీ కోర్ కమిటీ సభ్యుడు అల్లు ఆరవింద్, సీనియర్ నేత చెగొండి శనివారం డిల్లీకి వెళ్ళి సి. పి. ఎం జాతీయ నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరిల తో మంతనాలు జరిపారు. అరగంట పాటు జరిగిన మంతనాల్లో పి. ఆర్. పి. తన విధానాలను, ఇతర అంశాలను ప్రస్తావించింది. తెలుగుదేశం తో కూడినకూటమితో కలిసి పనిచేయడం కుదరదని మాత్రం పి. ఆర్. పి. స్పష్టం చేసింది. బి. జె. పి. తో కూడా కలిసి పనిచేయమని పి. అర్.పి చెప్పినట్లు సమాచారం. తన వైఖరిని స్పష్టం చేసిన పి. ఆర్. పి. ఇపుడు బంతిని సి. పి. ఎం కోర్ట్ లో పడేసి తమతో పొత్తు కావాలో, టి. డి. పి. తో పొత్తు పెట్టుకుంటుందో తేల్చుకోవడం ఆ పార్టీ విచక్షణకే వదిలి వేసింది. తమది లౌకిక వాదమని, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే వామపక్షాలతో కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పి. ఆర్. పి. చెబుతోంది. తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించిన సి. పి. ఎం. తాజాగా పి. ఆర్. పి. తో మంతనాలు జరపడం వెనుక ఆంతర్యం అంతు చిక్కడం లేదు. జాతీయ స్థాయిలో టి. డి. పి. ని కలుపుకొని ముందుకు సాగాలని సి. పి. ఎం బావిస్తున్న నేపథ్యం లో పొత్తులపై ఈ నెల 14 వ తేదీలోగా తన విధానాలను తేల్చి చెప్పి పొత్తు విషయం లో తన వైఖరిని ప్రకటించాలని రాఘవులు చెప్పడం వెనుక అసలు విషయం ఏమిటన్నది అర్థం కావడం లేదు. తమది ఇప్పటికీ సమైక్య వాదమేనని చెప్పిన రాఘవులు తెలంగాణకు తాము అడ్డుచెప్పబోమని కూడా అన్నారు. వామపక్ష జాతీయ నేతలను సంప్రదించకుండా చంద్రబాబు తెలంగాణా పై తన నిర్ణయాన్నిప్రకటించ రన్నది అందరికి తెలిసిందే. సమైక్య వాది అయిన రాఘవులకు చంద్రబాబు తెలంగాణా అనుకూల నిర్ణయం రుచించకనే ప్రజారాజ్యం పార్టీ కి సంకేతాలు ఇచ్చారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను కలుపు కొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్న సి. పి. ఎం. దానిలో బాగంగానే ప్రజారాజ్యానికి ఒక అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యాన్ని వదులుకోవడం వల్ల ముందు ముందు సమస్యలు రాకుండా చూడాలనే సి.పి. ఎం. బావిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం లేని కూటమి తో కలిసి పనిచేయడం తమకు సమ్మతమే నని పి. ఆర్. పి. తేల్చి చెప్పడం తో కోల్ కత్త లో జరగనున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం లో పొత్తుల పై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించిన సి. పి. ఎం. ఎవరితో కలవాలన్నది తేలాల్సి ఉంది. పొత్తులతో పని లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని మొదట్లో బావించిన పి. ఆర్. పి. ఆ తరువాత పొత్తులకు తాను సానుకూలమని సంకేతాలు ఇచ్చింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న రోజునే సి.పి. ఎం. రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కూడా తమ విధానలాలేమిటో చెబితే ఈ నెల 14 వ తేదీలోగా వైఖరిని వ్యక్తం చేస్తే కేంద్ర కమిటీ సమావేశాల్లో పి. ఆర్. పి తో పొత్తుల విషయం పై ఒక నిర్ణయం తీసుకోడానికి వీలవుతుందని చెప్పడం టి. డి. పి. లో కలవర న్ని లేపింది. సిద్దాంతాల ప్రతిపదికనే పొత్తులు ఉంటాయని గడువులు, తారీఖులు కావని పి. ఆర్. పి. కి చెందిన అధికార ప్రతినిది పరకాల ప్రభాకర్ కూడా అన్నారు. అటు సి. పి. ఐ. తెలుగుదేశం లేని కూటమికి ప్రయత్నాలు చేస్తోంది. మరో పక్క పి. ఆర్. పి. కూడా తెలుగుదేశం లేని కూటమితో పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని చెబుతోంది. ఈ నేపథ్యం లో సి. పి. ఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియాలంటే ఈ నెల 14 వ తేదీ దాకా వేచి చూడాల్సిందే.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



