| << Newer | Older >> |
on 2008/7/28 4:05:10
ముడుపులకు సంబందించిన వివాదం ఇంకా చల్లరాలేదు. ఈ ముడుపులకు సంబందించిన సి. డి. లను ప్రధర్షించాలని ఎన్. డి. ఏ. డిమాండ్ చేస్తోంది. ఈ విషయం లో స్పీకర్ ను కలిసి ఆయన పై వత్తిడి తీసుకొని రావాలని ఎన్. డి. ఏ. పట్టుబడుతోంది. ఎం. పి. లకు నోట్ల కట్టాలను ఇవ్వడం పై రికార్డ్ చేసిన వీడియో టేప్ లను ప్రదర్శ్చలని కూడా కోరుతోంది. విశ్వాస పరీక్ష సమయం లో ఎన్. డి. ఏ. కూటమి లోని బి. జె. పి. కి చెందిన ముగ్గురు ఎం. పి. లకు సమాజ్‌వాదీ పార్టీ నోట్ల కట్టాలను ఎర వేసిందని ఆరోపణ. విశ్వాస పరీక్షలో ఓటింగ్ కు హాజరకుండా గైరు హాజరు అయితే ఒక్కో ఎం. పి. కి ముడుకోట్ల రూపాయలు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఆ ముగ్గురితో బేరసరాలు ఆడినట్లు అడ్వాన్స్ గా ఒకొక్కరికి కోటి రూపాయలు అందజేసినట్లు ఆ ఎం. పి. లు లోక్‌సభ లో స్పీకర్ ఎదుట చెప్పారు సాక్ష్యంగా డబ్బు సంచులను స్పిక ఎదుట ఉంచారు. ఈ తతంగా మంత ఒక టి. వి. ఛానెల్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా రికార్డ్ చేసిందని వెల్లడించారు. ఏడు సి. డి లలో రికార్డ్ చేసిన తతంగాన్ని బైట పెట్టాలని ఇపుడు ఎన్. ది.ఎ. డిమాండ్ చేస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



