| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రాధీనేత పదవి ఎవరైన వద్దనుకుంటరా! తమ రాజకీయ జీవితం ముగిసెలోగా ఒక్కసారైనా ముఖ్యమంత్రి గా ఎన్నికై తన పాలన దక్షతను చాటుకోవాలని అందరు కోరుకుంటారు. తనను రెండు గంటల పాటు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుబెడితే తన సత్తా ఏమిటో చూపుతానని ఇటీవల సి. పి. ఐ. రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా ఓ సందర్భం లో అన్నారు. అలాంటి ముఖ్యమంత్రి పదవి పై తనకు ఏ మాత్రం ఆశలేదని పి. సి. సి. చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ చెప్పడం వింతాల్లోకెల్ల వింత. ఇంతకు శ్రీనివాస్ ముఖ్యమంత్రి పదవి వద్దని ఎందుకు అంటున్నారు? నిజంగా ఆ పదవి అంటే ఆయనకు ఇష్టం లేదా లేదంటే మరేదైనా కారణం ఉందా? అన్నది అంతు చిక్కడం లేదు. తమది విన్నింగ్ టీమ్ అని గతం లో వై. ఎస్., డి. ఎస్. లు చెప్పుకున్నారు. పి. సి. సి. కార్యవర్గం జాబితా విషయం లో పి. సి. సి. చీఫ్ మాటకు విలువలేకుండా పోయిందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పి. సి. సి. కార్యవర్గం జాబితా లో తన ముద్ర ఏమీ లేదని వై.ఎస్. చెబుతున్నారు. కార్యవర్గం జాబితా కూర్పులో శ్రీనివాస్ తో పలు మార్లు చేర్చించినట్లు వై. ఎస్. చెబుతున్నారు. చివరకు సోనియాగాంధీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్పమొయీలీతో చర్చించి తుది జాబితాను రూపొందించారని వై. ఎస్. అంటున్నారు. అదే నిజమైతే శ్రీనివాస్ ఎందుకంత అసంతృప్తి తో ఉన్నారో తెలియడం లేదు. డిల్లీ కి వెళ్ళి సోనియా, వీరప్పమొయిలీ లను కలిసి బైటకు వచ్చిన తరువాత శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నపుడు చాలా అసహనానికి గురయ్యారు. ఆది ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థం అయింది. ప్రత్యేక తెలంగాణా అంశం విషయాన్నే తీసుకుంటే జాతీయ భద్రత మండలి సమావేశం లో పాల్గొనడానికి వచ్చిన వై. ఎస్. తెలంగాణా అంశం పై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని దాట వేయడం, ఎన్. ఐ. సి. లో ఓ. వై. సి. వ్యాఖ్యలను సి. ఎం ప్రస్తావించడం , దానిపై డి. శ్రీనివాస్ కాస్త ఆగ్రహిస్తూ ఓ. వై. సి. ఒక్కరే ముస్లిం నేత అని ప్రశించడం తెలిసిందే. వీటిపై మీడియా అడిగినపుడు వై. ఎస్. వ్యాఖ్యలను గురించి ఆయననే అడగండి అని కాస్త చిరాకుగానే చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఒంటరి గానే పోటీ చేస్తామని సి. ఎం. అనడం, ప్రత్యేక తెలంగాణాపై అసెంబ్లీ లో తీర్మానం పెట్టాలన్న క్యాబినెట్ మంత్రుల ప్రతిపాదనలపై కూడా ముఖ్యమంత్రి మాత్రమే సమాధానం చెబుతారని దానిపై తాను స్పందించనని శ్రీనివాస్ అంటున్నారు. సి., ఎం. కు తనకు మద్య ఎలాంటి విబేధాలు లేవని చెబుతున్నారు.
తాను ఎక్కాడు ఉంటే గెలుపు అక్కడ ఉంటుందనే పార్టీ హైకామండ్ తనకు పి. సి. సి. చీఫ్ పదవి కట్టబెట్టిం దాని చెబుతున్న శ్రీనివాస్ ఇపుడు తాను నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పడం చూస్తుంటే ఆయనకు పి. సి. సి. చీఫ్ పదవి పై విరక్తి కలిగిందా అని అనిపిస్తోంది. లేదంటే పి. సి. సి. చీఫ్ పదవి అలంకార ప్రాయం అయిందని బావించారో ఏమో ఆయన చూపు ఇపుడు ఎం. పి. సీటు పై పడింది. రానున్న ఎన్నికల్లో తాను నిజామాబాద్ పార్లమెంట్ సీటు నుంచి పోటీచేయాలనుకుంటూనట్లు శ్రీనివాస్ తన శిష్యుడు నిజామాబాద్ ఎం. పి. మధు యాష్కీ తో చెప్పి ఆయనను అసెంబ్లీ కి పోటీచేయాలని సూచించారంట! దానికి ఆయన సమ్మతించారని సమాచారం. మొత్తానికి శ్రీనివాస్ ఎం. పి. సీటు కోసం ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నారు. బాగానే ఉంది పార్టీ పదవుల్లో నియమితులైన వారు రానున్న ఎన్నికల్లో టికెట్లు ఆశించరాదని శ్రీనివాస్ అన్నారు. మరి ఇపుడు దాన్ని శ్రీనివాస్ ఉల్లం గీస్తున్నట్లే అనుకోవాల్సి వస్తోంది మధు యాష్కీ కూడా తన గురువు కోసం నిజామాబాద్ సీటును త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నా తనకు కూడా ఎం . పి. సీటు కావాలని మరో ఎం. పి. స్థానం చూపాలని మధు పి. సి. సి. చీఫ్ ను కోరారని తెలిసింది.


