| << Newer | Older >> |
on 2008/6/28 10:54:14
ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రజ్యోతి దినపత్రిక యజమాన్యం లీగల్ నోటిస్ ను పంపింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక లో టి. డి. పి. అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వాటా ఉందని, ఆయన పెట్టుబడులు పెట్టారని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్‌రెడ్డి పదే, పదే చెప్పడమే కాకుండా, చంద్రబాబు ఆంధ్రజ్యోతి దినపత్రికలో పెట్టుబడులు పెట్టారని రాష్ట్ర అసెంబ్లిలోనూ, డిల్లీలోనూ వ్యాఖ్యానించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పత్రిక యజమాన్యం ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పై 50 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావాకు సంబందించి ఆయనకు తన న్యాయవాదుల ద్వారా నోటీసును జారీ జారీ చేసింది. ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబుకు పెట్టుబడులు ఉన్నట్లు చేసిన ఆరోపణలనుఆకు రుజువులు చూపాలని ఆ పత్రిక యజమాన్యం సవాల్ చేసింది. దానిపై పత్రిక యజమాన్యం ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెద్డికి లీగల్ నోటిస్ పంపింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



