| << Newer | Post Comments | Older >> |
మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం లో జరిగిన రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు కలిసి కట్టుగా ఆడి ఆసీస్ పై భారీ విజయాన్ని సాదించింది. బోర్డర్-- గవాస్కర్ 2008 ట్రోఫీ సీరీస్ లో బాగంగా జరుగుతున్న నాలుగు టెస్ట్ మ్యాచ్‌లో 1-0 ఆధిక్యత ను భారత్ దక్కించుకుంది.320 పరుగుల భారీ తేడా తో ఆసీస్ ఘోర పరాజయాన్ని పొందింది. ఆసీస్ ముందు 516 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచిన భారత్ ఆస్ట్రేలియాను కేవలం 195 పరుగులకే ఔట్ చేసింది. భారత్ జట్టులోని బౌలర్లు చాక్క్గా బౌలింగ్ చేసి అసిస్ నడ్డి విరిచారు. సోమవారం ఆట ముగిసే సమయానికి ఐదు కీలక మైన వికెట్లను కోల్పోయి కేవలం 141 పరుగులు చేయగలిగిన ఆసీస్ మంగళవారం బ్యాటింగ్ ను కొనసాగించి తన ఓవర్ నైట్ 141 స్కోర్ కు మరో54 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లను చేజార్చుకుంది. టిం ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం268 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయడం లో ఆసీస్ విఫలం కావడం, భారత్ రెండో ఇన్నింగ్స్ లో రాణించి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 314 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ను డిక్లేరె చేసింది. 516 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడానికి భరిలోకి దిగిన ఆసీస్ తీవ్రమైన వత్తిడికి గురైంది. పైగా భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ బు ఎదుర్కోవడం కూడా ఆసీస్ విఫలమైంది. 195 పరుగులకే తన 10 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది.


