| << Newer | Post Comments | Older >> |
అణు ఒప్పందం విషయం లో యు.పి. ఏ., వామపక్షల మద్య వివాదం ముదిరిపాకన పడింది. జి-8 సదస్సుకు వెళ్ళిన ప్రధాని అక్కడ వామపక్షాలపై చేసిన వ్యాఖ్యల తో వివాదం పతాక స్థాయికి చేరింది. అణు భద్రత ఒప్పందం చేసుకొని తీరుతామని ప్రదాని చేసిన విస్పష్ట ప్రకటనతో పాటు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్‌గొంటామని చెప్పడం తో వామపక్షాలతో తెగతెంపులకు తాను సిద్దమని ప్రధాని చెప్పినట్లైంది. ప్రధాని జపాన్‌కు బయలుదేరడానికి ముందు వామపక్షాలు రాసినట్లు చెబుతున్న లేఖ కు బదులు ఇవ్వడానికి కేంద్ర మంత్రి ప్రణబ్ సిద్దమై సమదానాన్ని కూడా సిద్దం చేసుకొని దానిని రహస్యంగా ఉంచారు. అయితే ప్రధాని చేసిన ప్రకటనతో ఇక తమ లేఖకు ప్రణబ్ బదులిచ్చినా ప్రయోజనం లేదన్న అభిప్రాయానికి వామపక్షాలు వచ్చాయి. అణు ఒప్పందం పై యు. పి. ఎ.కి అండగా నిలవలన్న సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం తో ప్రధాని వైఖరిలో మార్పు వచ్చింది. ఐ. ఎ.ఇ. ఏ. తో ఈ నెల 28 న ప్రధాని సమావేశం కావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రణబ్ నుంచి లేఖ అందుకున్న వామపక్షాలు యు. పి. ఎ.కు మరో అవకాశం ఇవ్వాలని బావిస్తున్నాయి. మరో సమావేశం ఏర్పాటు చేసి అణు ఒప్పందం పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని కోరనుంది. అణు ఒప్పందం లో వామపక్షల అభ్యంతరాలను పరిశీలిస్తామని ప్రధాని అన్నట్లు వినిపిస్తున్నాయి. ప్రదాని ఈ విషయాన్ని తెగేదాకా లాగుతారా? సామరస్యంగా పరిష్కరిస్తారా ? అన్నది వేచి చూడాలి


