| << Newer | Older >> |
on 2008/6/7 10:16:03
రాష్ట్రం లో జరిగిన ఉపఎన్నికల్లో కేవలం ఐదు ఆఎంబ్లీ, ఒక లోక్‌సభ సీటు నెగ్గిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం లో అర్థం లేదు. గత నాలుగేళ్లుగా రాష్ట్రం లో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పతికి ఉపెన్నికల్లో సాదించిన ఓట్ల శాతం గాని, దక్కించున్న సీట్లు గాని పరిశీలిస్తే సంబరాలు చేసుకే అంత సీన్ లేదు. నిజంగా అభివృద్ది మంత్రం ఫలించే ఉంటే తెలంగాణా ప్రాంతంలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి. అలా జరగలెదుంఉఖ్య మంత్రి స్వయంగా 10 రోజులపాటు తెలంగాణా ప్రాంతాంన్త సుడిగాలి పర్యటన , ఇన్‌చార్గ్ మంత్రులను రంగంలోకి దింపిన ఫలితం మాత్రం ఆశించిన మేరకు రలెదు.అధికర పార్టీలోని తెలంగాణా అనుకులవాదులు తెలంగాణా రాష్ట్ర సమితికి పరోక్షంగా సహకరించారని చెప్పాక తప్పదు. తెలంగాణా వాదం బలంగా లేదని అధికార పార్టీ చెబుతున్న సాంకేతికంగా గమనిస్తే కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకన్నా ఎక్కువ సీట్లు సాదించుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి నైతికంగా ఆ రెండు పార్టీల పై విజయం సాదించినట్లే. తెలంగాణా ప్రాంతం లో జరిగిన ఉప ఎన్నికల్లో 16 సీట్లకు కలిసి టి. ఆర్. ఎస్. పార్టీ34. 31 శాతం తో 6. 38, 069 ఓట్లను సదిన్చిన్ది.అదె కాంగ్రెస్ పార్టీకి 30. 26 శాతం తో 5,62, 695 ఓట్లు దక్కించుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ27. 7బీ శాతం తో5, 15, 485 ఓట్లను రాబట్టు కోగలిగింది. అదికారపార్టీకన్నా ప్రతి పక్ష పార్టీలైన తెలుగుదేశం, టి. ఆర్. ఎస్. లు కలిసి మొత్తం 11 సీట్లు సాదించాయి. అధికార పార్టీకి అన్ని హంగులు అర్థ బలం అధికార బలం , అంగ బాలమున్న కేవలం ఐదు సీట్లు మాత్రమే సాదించగలిగింది. అతి తక్కువ సీట్లు సాదించిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది కాదు!
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



