Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/6/27 2:32:01
.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సందిగ్ధం లో పడ్డారు. ఒక వైపు దేవేందర్ గౌడ్ పార్టీని వదిలి వెళ్ళడం తో పార్టీకి ఆయన వల్ల కలగనున్న నష్టాన్ని ఎలా నివారించాలా అని మధన పడుతుంటే మరో పక్క జాతీయ రాజకీయాల్లో ములాయం సింగ్ అణు ఒప్పందానికి సంబందించి యు. పి. ఏ. సంకీర్ణ కూటమికి వెవెన్ను దన్ను గా నిలవాలని బావించడం తో చంద్రబాబు డైలామా లో పడ్డారు. యు. ఎన్. పి. ఏ. కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు ములాయం సింగ్ తో ఫోన్ లో మాట్లాడినప్పటికీ, యు. ఎన్. పి. ఏ. సమావేశం లో పాల్గొని కూలంకశంగా చర్చించడానికి చంద్రబాబు డిల్లీ వెళ్ళ నున్నారు. ఇంకో పక్క తెలంగాణా విషయం లో పార్టీ వైఖరి స్పష్టం చేయక పోతే తెలంగాణా ప్రాంతంలో పార్టీ దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేవేందర్ గౌడ్ తెలంగాణా విషయం లో ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేయడం,రేపు హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ అధ్యక్షతన ఒక సదస్సు ను నిర్వహించనుండటం తో పార్టీలోని బి. సి. నేతలు గౌడ్ శిబిరం లోకి వెళ్ళ కుండా నివారించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయన్నది రేపటి గౌడ్ సదస్సు తరువాత గాని అర్థం కాదు. రాష్ట్రం లో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంది. ఇదే సమయం లో ములాయం సింగ్ కాంగ్రెస్ కు వెన్ను దన్ను గా నిలవాలని అనుకోవడం బాబును సందిగ్ధం లో పడేసింది. తెలంగాణా విషయం లో ఒక వైఖరికి రావాలంటే కోర్ కమిటీ సమావేశం మరో సారి జరగాలి. దేవేందర్ గౌడ్ స్థానం లో మరొకరిణి నియమించాలి. ఆది ఎవరన్నది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కమిటీ మలి సమావేశం లోగాని తెలంగాణా పై పార్టీ వైఖరి స్పష్టం కాదు. మరో పక్క దేవేందర్ గౌడ్ చాలా వేగంగా తన పావులను కదుపుతున్నారు. బి. సి. లను తన శిబిరం వైపు ఆకర్షించడానికి సామాజిక న్యాయం అన్న అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. దానిని అడ్డుకోవడానికి ఇప్పటికే చంద్రబాబు బి. ల కోసం 100 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. బి. సి. ల కు సంబందించిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. అయినా అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై పార్టీలోనే సందేహాలు ఉన్నాయి. ఈ సమస్యలు చాలా వన్నట్లు ఇపుడు జాతీయ స్థాయిలో యు. ఎన్. పి. ఏ. కూటమిలో కీలక మైన సమాజ్‌వాదీ పార్టీ అదినేత ములాయం సింగ్ అణు ఒప్పందం విషయం లో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని అనుకుంటుండటం చంద్రబాబును కలవరానికి గురి చేస్తోంది. ములాయం సింగ్ పార్టీలో 39 మంది ఎం. పి. లు ఉన్నారు. అణు ఒప్పందం విషయం లో ప్రధాని తన పట్టు విడటం లేదు. అణుఒప్పందం జరిగితే మద్దత్తు ఉప సంహరించుకుంటామని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యం లో యు. పి. ఏ. కూటమి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. యు. పి. ఏ. ప్రభుత్వానికి తమ పార్టీ మద్దత్తు ఉప సంహరించుకున్నట్లు బి. ఎస్. పి. అదినెత్రి మాయావతి ప్రకటించడం తో యు. పి. ఏ. ఇరుకున పడింది. స్థానిక రాజకీయాల్లో మాయావతి ని దెబ్బ తియడానికి ములాయం యు. పి. ఏ. కు వెన్ను దన్ను గా నిలవాలని అనుకుంటున్నారు ఈ విషయం గురించి చర్చించడానికి జులై మూడో తేదీన డిల్లీలో యు. ఎన్. పి. ఏ. సమావేశం కానుంది. చంద్రబాబు ఆ సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసిన తరువాతే చంద్రబాబు కూడా తెలంగాణా విషయం లో ఒక నిర్దుష్టమైన అభిప్రాయానికి రావచ్చునని సమాచారం. తెలంగాణా పై నియమించిన కోర్ కమిటీ సమావేశం కూడా ఒక నిర్ణయానికి రావచ్చునని తెలిసింది. యు. పి. ఏ., వామపక్షల సమన్వయ కమిటీ 10 వ సమావేశం కూడా జులై లో జరగనుంది. అప్పటికీ ములాయం మద్దత్తు విషయం కూడా తేలిపోతుంది. ఆ తరువాతనే కాంగ్రెస్ ఎం చేయాలన్నది యోచిస్తుంది. ఒక వేళ ములాయం కాంగ్రెస్ అండ గా నిలిస్తే తమ పరిస్థితి ఏమిటని చంద్రబాబు మధన పడుతున్నారు. ఎలా చూసిన కేంద్రం లో వామపక్షల సంఖ్య ఎక్కువ. దానికి సమంగా సంఖ్యను పెంచుకోవాలంటే ములాయం తో పాటు మిగిలిన చిన్న చితక పార్టీల మద్దత్తును యు. పి. ఏ. కూడా గట్టాలి. లేని పక్షం లో అణు ఒప్పదం వాయిదా వేసి మనుగడ సాగించాలి. ఇవేవీ వద్దు అనుకుంటే ఒప్పందం పై సంతకానికి నిర్ణయించుకొని వామపక్షల మద్దత్తును కోల్పోయి ముందస్తుకు వెళ్ళాలి. యు. ఎన్. పి. ఏ. కూటమి నిర్ణయం పై ఇవన్ని ఆధారపడి ఉన్నాయి.






Related Stories:

  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • వ్యూహం మార్చిన టి. ఆర్. ఎస్.
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • నమ్మకం సడలిందా
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • వివాదానికి కారణం ఏమిటి?
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • దేశవ్యాప్త బంద్ 20న
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఇంగ్లాండ్ పై భారత్ విజయం
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • దేవేందర్ రాజకీయం
  • కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్
  • నవ్య నినాదం కోసం బాబు ఆరాటం
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • యాత్రల జాబితాలోకి మరో పార్టీ
  • పులివెందుల్లో టెన్షన్-- టెన్షన్
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |