| << Newer | Older >> |
on 2008/9/25 12:01:37
అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద గురువారం నిర్వహించిన ఉమ్మడి నిరసన కార్యక్రమానికి ప్రజారాజ్యం పార్టీ తన సంఘీభావాన్ని తెలిపింది. రాజకీయ పార్టీని స్థాపించిన తరువాత మొదటిసారిగా ప్రజారాజ్యం పార్టీ విపక్ష పార్టీలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి తన అధికార ప్రతినిది డాక్టర్ మిత్రను పంపింది. అణు ఒప్పందం లోని అంశాలు జాతీయ విధానానికి భంగకరంగా ఉన్నాయని వాటి పై తిరిగి మొదటి నుంచి చర్చించాలని డిమాండ్ చేశారు. దేశ సాధికారికత, విదేశాంగ విధానానికి సంబందించిన అణు ఒప్పందం పారదర్శకంగా ఉండాలని మిత్ర అన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడే విషయం లో తమ పార్టీ ఎవరితోనానిన కలిసి పనిచేస్తుందని తెలిపారు. దేశానికి మరణశాసనం లాంటి అణు ఒప్పందం పై ప్రధాని సంతకం చేయరాదని విపక్ష పార్టీలన్ని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రంలో టి. డి. పి. వామపక్షాలు, టి. ఆర్. ఎస్., బి. ఎస్. పి. పార్టీలు పాల్గొన్నాయి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



