| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రం లో రైతు చైతన్య యాత్రలను నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఈ. సి. ఆమోదం లబించింది. అయితే కొన్ని షరత్తులను విడించింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లాలలో నిర్వహించే రైతు చఐతన్య యాత్రల్లో ప్రజా ప్రతినిదులు పాల్గొనరాదని నిభందన విడించింది. అలాగే ఈ రైతు చైతన్య యాత్రల్లో రాజకీయ ప్రసంగాలు చేయరాదని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కూడా నిభందన విడించింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో చేపట్టే రైతు చైతన్య యాత్రలకు ప్రజా ప్రతినిదులు హాజరు కాబోరని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు హామీ ఇవ్వడం తో ఈ. సి. రైతు చైతన్య యాత్రలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీని ఉలంఘించినట్లైతే ఖాటిన చర్యలు తీసుకోడానికి వెనుకాడమని ఈ. సి. హెచ్చరించింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలకు ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రాకపోయినా ఆ జిల్లాల్లో రైతు చైతన్య యాత్రలను నిర్వహిచలని శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. కమిషన్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడటం పై మంత్రి మండలి హర్షం వ్యక్తం చేసింది.


