| << Newer | Older >> |
on 2008/7/17 18:46:47
జార్ఖండ్ ముక్తి మోర్చా(జె. ఎం. ఎం.) అధినేత శిబు సోరెన్ చూడబోతే డబుల్ గేమ్ అడు తున్నట్లు కనిపిస్తోంది. ఐదుగురు ఎం .పి. లను కలిగిన జె. ఎమ్.ఎమ్. పార్టీ ఒకపక్క యు. పి. ఏ. తో ను, మరోపక్క ఎన్. డి. ఏ. తో ను మంతనాలు జరుపుతున్నారు. శిబుసోరెన్ ఇపుడు ఎటు తేల్చుకోలేక పోతున్నారు. తనకు పదవి ఇస్తే చాలు యు. పి. ఏ. కు. మద్దత్తు ఇస్తానని చెప్పిన శిబుసోరెన్ కు మంత్రి పదవి ఇవ్వడానికి తాము సుముఖమే నని యు. పి. ఏ. సంకేతాలను పంపినా తటపటాయిస్తున్నారు. యు. పి. ఏ. కు అనుకూలంగా ఉన్నా ఆయన ఎన్. డి. ఏ. తోనూ మంతనాలు సాగిస్తున్నారు. శిబుసోరెన్ తో బి. జె. పి. కూడా చర్చలు జరుపుతోంది. యు. పి. ఏ. కూటమిలోని పార్టీలను చిల్చడానికి బి. జె. పి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోనుంది. ఇంతకు శిబుసోరెన్ ఇపుడు బి.జె. పి. వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు. మర్డర్ ట్రేయిల్ ఎదుర్కొంటూ కళంకిత మంత్రిగా ముద్రపడి కేంద్రంలో పదవిని కోల్పోయిన శిబుసోరెన్ యు. పి. ఏ. పై కోపం తో ఉన్నట్లు సమాచారం. తాను ఇపుడు యు. పి. ఏ. కి అనుకూలంగా ఓటు వేసినా తన కేసు విషయం ఏమిటని ఆయన మదన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ విశ్వాస పరీక్షలో యు.పి. ఏ. ఓటమి పాలైతే బి. జె. పి. తో శతృత్వం కొని చెచ్చుకోవాల్సి వస్తుంది. ఏ కారణంగణైనా రాష్ట్రం లో ముందు ముందు యు. పి. ఏ. తమ ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరిస్తే అప్పుడు బి. జె.పి. అండ కావాలి. అందుకే శిబుసోరెన్ తటపటాయిస్తున్నరు. ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆది మరింత ప్రమాదం. ఏదో ఒక వైఖరి ని ప్రకటించడం మంచిది. లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




