| << Newer | Older >> |
on 2008/7/14 18:39:05
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరని చెబుతున్న రాజకీయనేతలే శత్రువుకు శత్రువు మిత్రుడు అని కూడా చెబుతున్నారు. దేశరాజకీయాల్లో అణు ఒప్పందం రగిల్చిన చిచ్చు పార్టీలను దహిస్తోంది. అణు ఒప్పందాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వామపక్షాలు ప్రభుత్వ మొండి వైఖరితో విసిగి మద్దత్తు ను ఉపసంహరించుకుంది. రాష్ట్ర రాజకీయాలే తమకు ముఖ్యమనుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ని బలహీన పరచడానికి గతంలో తాను తీవ్రంగా య్‌వతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తో కలిసి కాపురం చేయడానికి తెగించింది. దానికోసం తాను ఏర్పాటు చేసిన యు. ఎన్. పి. ఏ. ను నిలువున ముంచడానికి కూడా సిద్దపడింది. యు. పి. ఏ., ఎన్. డి. ఏ. లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన యు. ఎన్.పి.ఎ. ఛైర్మన్‌గా ఉన్న ములాయంసింగ్ తన రాజకీయం అంత ఉత్తర్‌ప్రదేష్‌కే పరిమితం చేస్తున్నారు. బహజాంసమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి ని దెబ్బతీయడం కోసం సమాజ్‌వాదీ పార్టీ యు. పి. ఎ.కి స్నేహ హస్తం అందిస్తే యు. పి. ఎంఉ వ్యతిరేకిస్తున్న వామపక్షాలు ములాయంకు గుణపాఠం నేర్పడానికి మాయావతి తో దోస్తీకి సిద్దపడ్డాయి. మొన్నటిదాకా మౌనాగ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు మాయావతి పై పాత కేసులను తిరగ దొడడానికి సిద్దపడటం వెనుక ములాయం హస్తం ఉందని వేరే చెప్పనక్కరలేదు. తనను రాజకీయంగా అణగదొక్కడనికి కాంగ్రెస్ ,సమాజ్‌వాదీ పన్నుతున్న కుట్రలను గ్రహించిన మాయావతి దానికి విరుగుడుగా తృతీయ ఫ్రంట్ లో చేరి కాంగ్రెస్ నేతృత్వంలోని యు. పి. ఏ. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్దం అయ్యారు. మాయావాతీని తమ వైపు టిప్పుకోవడంలో సి.పి. ఎం. కీలక పాత్ర పోషించింది. చంద్రబాబుకు మాయావతి ఫోన్ చేసి మాట్లాడటం వెనుక సి.పి.ఎమ్ ఉంది. అణు ఒప్పందానికి తాను వ్యతిరేకమని, యు. పి. ఏ. ప్రవేశపెట్టనున్న విశ్వాస తీర్మానానికి తమ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని మాయావతి ప్రకటించేలా సి. పి. ఎం వేసిన పాచిక పరింది. ఇక సిద్దాంటిక వ్యతిరేకత ఉన్నా యు. పి. ఏ. ను దెబ్బ తియాలన్న ఒకే ఒక కారణంతో ఎన్. డి. ఏ. సహకారాన్ని తీసుకోడానికి కూడా వామపక్షాలు వెనుకాడటం లేదు. ఎన్. డి. ఏ., కూడా వామపక్షాలతో కలిసి విశ్వన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేయడానికి సిద్దపడింది. ఉమ్మడి శత్రవువైన యు. పి. ఏ. ను గద్దె దింపడానికి ఆ షట్నంలో మరొకరిణి కూర్చో పెట్టడానికి తమ మద్య ఉన్న సైద్దాంటిక విబెడాన్ని కాస్త పక్కన పెట్టడానికి కూడా ఎన్.ది. ఏ, వామపక్షాలు సిద్దం అయ్యయై. ఇక ప్రధాని కావాలని ఎప్పటినుంచో కళలు కంటున్న మాయావతి కూడా ఈ అవకాశాన్ని తనకు అనువుగా మలుచుకోడానికి ఉవ్విళ్ళూరుతోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



