| << Newer | Older >> |
on 2008/5/7 6:48:05

ఉపఎన్నికలను ప్రతిష్టగా బావించిన తెలంగాణా రాష్ట్ర సమితి ఈ సారి తన వ్యూహాన్ని మార్చింది. ప్రతి ఎన్నికల్లోనూ బహిరంగ సభలకు అధిక ప్రధాన్యతను ఇచ్చే టి. ఆర్. ఎస్. ఈ సారి బహిరంగ సభలను తగ్గించి ఇంటింటి ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టడానికి నిర్ణయించింది. తెలంగాణా ప్రాంతం లో ఎండలు విపరీతంగా ఉండటం , మండే ఎండల్లో బహిరంగ సభలను నిర్వహించడం మంచిది కాదనుకున్న పార్టీ ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించాలని బావిస్తోంది. కళా బృందాల సేవలను ఈ సారి పెద్ద ఎత్తున వినియోగించుకోవడమే కాకుండా, విద్యార్థి విభాగాన్ని కూడా రంగంలోకి దింపి గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని బావించింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



