| << Newer | Older >> |
on 2008/10/5 3:27:20
తమ నానో కార్ల ప్రాజెక్ట్ ను సింగూరు నుంచి మరో ప్రాంతానికి తరలించడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగినా ముందు ప్రకటించిన ధరకే అంటే రూ. లక్ష కె కారును అందివ్వాలన్న పట్టుదలతో టాటా మోటార్ సంస్థ ఉంది. సింగూరు నుంచి తమ యూనిట్ ను తరలించడం వల్ల ఒక్క టాటా సంస్థకే దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లనుంది. సింగురులో కార్ల యూనిట్ కోసం నిర్మించిన భవనాలు సాదారణ మౌలిక వసతుల పై ఇప్పటికే ఆ సంస్థ 500 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. నానో యూనిట్ మొత్తం ప్రతిపాదిత వ్యయం దాదాపు రూ. 1500 కోట్లు అని అంచనా. సింగూరు నుంచి యూనిట్ ను తప్పించడం వల్ల కార్ల నిర్మాణ వ్యయం తప్పకుండా పెరుగుతుంది. అయితే ఆ నష్టాన్ని భరించడానికి సంస్థ మార్గాలను అన్వేషించాల్సి ఉంది. అయితే అనుకోకుండా నానో యూనిట్ కోసం రాష్ట్రాల మద్య పెరిగిన పోటీలో ఆంధ్ర ప్రదేశ్ టాటా సంస్థకు ఇచ్చిన ఆఫర్ మిగిలిన రాష్ట్రాలకన్నా ఆకట్టుకునేలా ఉంది. యూనిట్ కు అవసరమయ్యే 1000 ఎకరాల స్థలాన్ని రాష్ట్రం లో టాటా సంస్థ ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వడానికి సిద్దం అవడమే కాకుండా, సింగురులో నష్టాన్ని పుడ్చుకునే వెసులుబాటు కూడా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ద పడింది. 50 శాతం నష్టాన్ని భరించడానికి ముందుకొచ్చింది. ఇక రాయితీలు గురించి చెప్పనక్కరలేదు. టాటా సంస్థను దృష్టి లో పెట్టుకునే ప్రభుత్వం ఆటో మొబైల్ రంగానికి శనివారం అనేక వరాలను ప్రకటించింది. నాలుగు వేల కోట్ల రూపాయల పైబడిన పరిశ్రమలకు 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు తో పాటు విద్యుత్ పన్నుల నుంచి పదేళ్ళ మినహాయింపు లభించనుంది. వ్యాట్. సి. ఎస్. టి. లకు 21 ఏళ్లు మినహాయింపు ఇవ్వనున్నారు. ఇంకా అనేక మినహింపులు దక్కనున్నాయి. ఇవన్ని గ్రహించిన టాటా మోటార్స్ సంస్థ తన ప్రతినిదుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపింది. ఆ బృందం ఆదివారం సాయత్రం హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి చర్చించనుంది. అన్ని అనుకూలిస్తే నానో కార్ల యూనిట్ రాష్ట్రానికి వచ్చిన రావచ్చు. మరో కొన్ని గంటల్లో అన్ని తెలిసి పోతాయి లెండి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



