| << Newer | Older >> |
on 2008/9/13 23:04:39
రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వారు మొదటగా వాడే పదం సేవ. పదవులు, అధికారం ఆశించకుండా కేవలం ప్రజా సేవ చేయడానికో, ప్రజా సేవకులుగా ఉండటానికో అయితే రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఏముంది? రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తామంటే ప్రజలు వద్దంటారా? కొత్త గా రాజకీయాల్లోకి వారు వస్తున్న వారు ప్రజా సేవకు రాజకీయాల్లోకి వస్తున్నామని చెబితే ప్రజలు కొంత మేరకు నమ్మ వచ్చునేమో కానీ వలస వదులు కూడా అదే పదాన్ని వాడితే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు. ప్రజల్లోనూ ఇపుడు రాజకీయ చైతన్యం బాగానే పెరిగింది. ఎవరు ఎం మాట్లాడుతున్నారు, అన్నది బాగానే అర్థం చేసుకుంటున్నారు. తమ పార్టీ లోకి వస్తున్నావారంత కేవలం ప్రజా సేవకోశమే వస్తున్నారని ప్రజా రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పడం జరుగు తోంది. రోజుకోకరు చొప్పున ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు చిరు పార్టీలో చేరుతున్నారు. వారంతా రాజకీయాల్లో తల పండిన వారు పదవులు అనుబవించిన వారు. చెగొండి, కోటగిరి, భూమ దమపఠులు, తమ్మినేని సీతారాం, రామచంద్రాయ్య లను పరిశీలిస్తే వీరంతా గతం లో వారు పని చేసిన పార్టీల్లో పదవులు అనుబవించిన వారే. వారంతా ప్రజా సేవ చేయడానికే తమ పార్టీలో చేరారని పదవులు ఆశించి కాదని చిరు అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. వారి గురించి బాగా తెలిసిన వారు మాత్రం వారి మాటలను చచ్చిన నమ్మరు. చీరును కలవడానికి ప్రతి రోజు భారీ సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. వారు కేవలం అభిమానులు మాత్రమే. ఈ అభిమానులను, వలస వాదులను చూసి తన పార్టీకి జనాధారణ పెరుగుతోందని చిరంజీవి అనుకోవడం. కాంగ్రెస్ కు తాము మాత్రమే ప్రత్యర్థి పార్టీ అని చెప్పడం చూస్తే మితిమీరిన ఆత్మవిశవాసం చిరు పార్టీలో కనిపిస్తోంది. ఆది అంత మంచిది కాదు. కంగర్స్ తప్ప ఇతర పార్టీలన్ని తమ కన్నా చాలా బలహీన మైనవన్న ధీమా చిరు పార్టీ కి కలగడం అంటే రాజకీయాల్లో ఆ పార్టీ ఇంకా ఓనమాలు దిద్దలేదని తెలుస్తూనే ఉంది. లేదా ఆ పార్టీ మేక పోతూ గాంభిర్యాన్ని ప్రదర్శిస్తోందని అనుకోవాలి. రాజకీయాలంటే అశమశీ కాదు. ఎన్నికల్లో అంత సునాయాసం కదు.ఎన్థొ చమటోడ్చలి. శ్రమించాలి. 1982 లో ఎన్. టి. ఆర్. రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు కూడా ఆయన 9 నెలలు ఎంతో శ్రమిస్తే కానీ అధికారం లోకి రాలేక పోయారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ,రాజకీయ శూన్యత ఎన్. టి. ఆర్. కు ఎంత గానో ఉపకరించాయి. ఆయన ఒక మహా నటుడు ప్రజలు విపరీతంగా అరాదించే ఆరాధ్య దైవం. తన గ్లామర్ మాత్రమే ఆయన నమ్ముకోలేదు. ప్రజల్లోకి వెళ్ళి వారితో మమేకమై వారి బాధలను అడిగి తెలుసుకొని స్పందించారు. ఆవేశ పూరిత ప్రసంగాలతో , అధికార పార్టీ అవినీతిని ఎండ గట్టా రు. పదవులు అధికారం తెరగా రాదు అని అన్ని పార్టీలు గ్రహించాలి
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



