| << Newer | Older >> |
on 2008/7/22 7:26:16
యు. పి. ఏ. ప్రభుత్వాధినేత , ప్రధాని విశ్వాస పరీక్షలో విజయం సాదించారు. మంగళవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఓటింగ్ లో యు.పి. ఏ. కు అనుకూలంగా 253 , ప్రతికూలంగా232 ఓట్లు పోల్ అయ్యాయి. ఇద్దరు ఓటింగ్ లో పల్కొనలేదు. మంగళవారం మొత్తం 487 మంది సభ్యులు ఓటింగ్ లో పల్కొన్నారు. 21 ఓట్ల తేడా తో ప్రభుత్వం విజయం సాదించింది. విశ్వాస పరీక్షలో ప్రధాని విజయం సాదించిన ఆయన వదనం లో చిరునవ్వు కనిపించలేదు. చాలా గంభీరంగా కనిపించారు. అంతను ముందు బి. జె. పి.కి చెందిన ముగ్గురు సభ్యులను నోట్ల కట్టలతో కొనుగో;ఉ చేయడానికి బేరం కుదిరిందని అంటూ తమకు అడ్వాన్స్ గా 3 కోట్ల రూపాయలు చిల్లించారని ఆ ముగ్గురు ఎమ్.పి. లు స్పీయక్ర్ ఎదుట నోట్లకత్టల సంచులను సాక్ష్యంగా చూపడం తో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దానిపై చాలాసేపు రాబస జరిగింది. విశ్వాస పరీక్షకు ముందు రెండురోజులుగా జరిగిన చర్చ పై ప్రధాని మంగళవారం ఓటింగ్ కు ముందు తన సమాధానాన్ని వినిపించినా విపక్ష సభ్యుల అల్లారితో ఆయన ఎం మాట్లాడారో కూడా ఎవరికి వినిపించలేదు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



