| << Newer | Post Comments | Older >> |
అణు ఒప్పందం విషయంలో యు.పి. ఏ. వామపక్షాల హెచ్చరికలను బేఖాతరు చేయడం తో యు. పి. ఏ. కు వామపక్షాలు గుడ్‌బై చెప్పాయి. మైనార్టీ లో పడిన యు. పి. ఏ. ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని పొంది తీరాల్సి ఉంది. ఆగస్ట్ 12 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఆ లోగా ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పార్లమెంట్ లో మన్మోహన్ ప్రభుత్వం విశ్వాసాన్ని పొందాలి. యు. పి. ఎ.కు మద్దతు ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ బుధవారం రాష్ట్రపతిని కలిసి తాము యు.పి. ఏ. కు మద్దతు ఇస్తున్నట్లు లేఖను సమర్పించనుంది. అలాగే వామపక్షాల కూటమి కూడా ప్రభుత్వానికి మద్దతు ను ఉప సంహరిస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ ఇవ్వనుంది. వామపక్షాలు మద్దత్తు ఉప సంహరించుకున్నా తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదని తాము పూర్తి కాలం అధికారంలో కొనసాగగలుగుతామని యు. పి. ఏ. ఎంతో నిబ్బరంగా చెబుతున్నా పరిస్థితి అంత సులువుగా లేదు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ప్రధానిని పార్లమెంట్ విశ్వా సాన్ని పొందాలని రాష్ట్రపతి ఆదేశించవచ్చు. లేదా ప్రధాని రాష్ట్రపతిని కలిసి తమ ప్రభుత్వానికి సమాజ్‌వాదీ పార్టీ ఇస్తున్న మద్దతు పై తమ ప్రభుత్వానికి ఉన్న సంఖ్య బలాన్ని గురించి వివరించవచ్చు. ప్రధాని వివరణతో రాష్ట్ర పతి సంతృప్తి చెందితే సరి. లేని పక్షం లో ప్రధాని పార్లమెంట్ విశ్వాసాన్ని పొందాలి. సమాజ్‌వాదీ మద్దత్తు ప్రకటించినా ఇంకా ఏడు గురు సభ్యుల మద్దతు అవసర మౌతుంది. దాంతో చిన్న చితకా పార్టీల మద్దతును తీసుకోడానికి యు. పి. ఏ. తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించినా మాయా వతి సమాజ్‌వాదీ పార్టీలో చీలిక తీసుకొని వస్తే విశ్వాస పరీక్షలో యు. పి. ఏ. నిలవగలుగుతుందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. పార్లమెంట్ విశ్వాసాన్ని పొందలేక పోతే యు. పి. ఎ.ప్రభుత్వమ్ కూలిపోతుంది. ఈ గండం నుంచి యు. పి. ఏ. ప్రభుత్వం ఎలా బైట పడుతుందో చూడాలి.


