| << Newer | Post Comments | Older >> |
అనుమతి లేకుండా తమ ఇంటి ముందు బ్యానర్లు కట్టడం తో ఆగ్రహించిన కాంగ్రెస్ నేత ఒకరు అడ్డు చెప్పడం, దానిపై వాగ్వివాదం జరిగి ఆది కాస్త దాడికి దారి తీసిన సంఘటన ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గమైన పులివెందులలో మంగళవారం చోటుచేసుకుంది. ప్రజారాజ్యం పార్టీ అదినేత చిరంజీవి బుదవారం పులివెందులలో తన ప్రజా అంకిత యాత్రను నిర్వహించనున్నారు. యాత్ర ఏర్పాట్లను పరిశీలించడానికి పి. ఆర్. పి. కి చెందిన సీనియర్ నేతలు శోభ నాగి రెడ్డి, మరో సీనియర్ నేత కోటగిరి విద్యదరరావు , మరికొందరు నేతలు పులివెందులకు చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు ,కార్యకర్తలకు స్థానికులకు మద్య మాట మాట పెరిగి వివాదానికి దారి తీసింది. దాంతో కొందరు దాడికి దిగడమె కాకుండా రాళ్లు విసరడం తో నేతలు పరుగుదియాల్సి వచ్చింది. దాడిలో కార్లు ధ్వంసం అయ్యాయి. పి. ఆర్. పి. నేతలు బస చేసియన్ గెస్ట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వై. ఎస్., జగన్ అభిమానులు అక్కడ ఘొరావ్ చేస్తున్నారు. తమ నేతలకు బే ష ర త్తు గా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించామని, వై. ఎస్. ను వ్యక్తిగతంగా విమర్శించలేదని పి.అర్.పి. నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పడం కుదరదని పి. ఆర్. పి. నేతలు వాదిస్తున్నారు.


