| << Newer | Post Comments | Older >> |
దివాకర్ ట్రావేల్స్ యజమాని, మంత్రి జె. సి. దివాకర రెడ్డి సోదరుడు జే. సి. ప్రభాకర్ రెడ్డి తో రవాణా శాఖ అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కెసినెని ట్ర్యావెల్స్ తో రవాణా శాఖ అదికారులు లాలూచీ పడినట్లు జె. సి. ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. రవాణా శాఖ అధికారుల పై పరుష పదజాలం తో విరుచుక పడటమే కాకుండా ఫైళ్ళను కూడా విసిరి కొట్టి వీరంగం సృష్టించారు. రవాణా శాఖ అధికారుల తీరును నిరసిస్తూ ప్రభాకర్ రెడ్డి ఖైరాతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమ ట్ర్యావెల్స్ కు చెందిన బస్సులకు అన్ని రకాల అనుమతులు, పర్మీట్లు ఉన్నా రవాణా శాఖ తమను వెదిస్తోందని ఆయన ఆరోపించారు. తమ పై కక్ష కట్టిన అసలు సూత్ర దారి ఎవరో తెలేవరకు తాను ధర్నా విరమించానని ఆయన మొండి కేశారు. ఒకపక్క ధర్నా కొనసాగుతుండగానే అధికారులు ఆయన వద్దకు వెళ్ళి చర్చలకు ఆహ్వానించారు. రాజీకి ప్రయత్నాలు జరుగుతున్న సమయం లోనే ఎవరు ఏమీ చెప్పారో, ఏమైందో కానీ ప్రభాకర్ రెడ్డి మధ్యల్ లో లేచి వెళ్ళిపోయారు. చర్చలు విఫల మయ్యాయి.


