| << Newer | Older >> |
on 2008/7/15 19:02:18
తెలంగాణా రాష్ట్ర సమితి బుదవారం విప్ జారీచేయనుంది. తన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ నెల 22 న జరగనున్న పార్లమెంట్ ప్రత్యేకసమావేశానికి హాజర్ కావాలని పార్టీ ఆదేశించనుంది. యు. పి. ఏ. ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ సభ్యులను ఆదేశించనుంది. తెలంగాణా రాష్ట్ర సమితి లో ప్రస్తుతం ఇద్దరు ఎం. పి. లు ఉన్నారు. మరో ఎం. పి. నరేంద్ర ఉన్నా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే నరేంద్ర టి. ఆర్. ఎస్. టికెట్టు పైనే ఎం. పి. గా ఎన్నికైన కారణంగా సాంకేతికంగా చూస్తే ఆయన ఇప్పటికీ టి. ఆర్. ఎస్. సభ్యుని కిందకు వస్తారు. టి. ఆర్. ఎస్. జారీ చేయనున్న విప్ ఆయనకు కూడా వర్తిస్తుందని అంటున్నారు. నరేంద్ర కూడా టి. ఆర్. ఎస్. పంథాలోనే ఆలోచిస్తున్నారు. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తే తాను యు. పి. ఏ. ప్రవేశ పెట్టనున్న విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేస్తామని, లేని పక్షంలో వ్యతిరేకంగా ఓటు వేస్తానని నరేంద్ర అంటున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




