| << Newer | Post Comments | Older >> |
ప్రజారాజ్యం పార్టీ కి అన్నిటి పై అవగాహన ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిది ప్రభాకర్ చెప్పడం బాగానే ఉంది మరి అన్ని విషయాలపై అవగాహన ఉండి ,సమస్యలపై స్పష్టత ఉంటే పార్టీ విధాన నిర్ణయాలను ఇప్పటికీ ఎందుకు వెల్లడించ పోతున్నారో అర్థం కావడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన దాన్ని ఎదుర్కోడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని ఆయన చెప్పడం బాగానే ఉంది. నిన్ననే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించాల్సి ఉంది. పార్టీ సంస్థ గత నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. ఏ పార్టీ అయిన నిలదొక్కుకోవాలంటే ఇదంతా ముఖ్యం. అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. పార్టీకి క్యాడార్ చాలా ముఖ్యం క్యాడార్ అంటే అభిమానులు మాత్రమే కాదు పార్టీని నడిపించడానికి చిత్తశుద్దితో నిజాయితీగా పని చేసే వారు అవసరం. అలాంటి క్యాడార్ ను పి. ఆర్. పి. ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. రానున్న ఎన్నికల్లో ప్రదాన సమస్యలపై తమ పార్టీకి అవగాహన ఉందని ప్రభాకర్ చెబుతున్నారు. తెలంగాణా పై స్పష్టత ఉందని కూడా అంటున్నారు. ఎస్. టి., ఎస్. సి వర్గీకరణ, చేనేత కార్మికుల సమస్యలు, రైతుల ఇబ్బందులు సేజ్ ల సమస్య ఇలా అన్నింటి పై పి. ఆర్. పి. కి అవగాహన ఉందని పార్టీ చెబుతోంది. రానున్న ఎన్నికల్లో పి. ఆర్. పి. సంచలనం సృష్టిస్తుందని, తమ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని కూడా ప్రభాకర్ తెలుపుతున్నారు. విమర్శలకు ప్రతిస్పందిస్తామని అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శల పై ఘాటుగా స్పందించక పోతే బలహీన మైన పార్టీ అన్న ముద్ర పడుతుంది. ఒకసారి అలా ముద్ర పడితే దాన్ని చేరీపి వేయడానికి చాలా కష్ట పడాలి. ప్రతి విషయం లోను నాన్చుడు ధోరణి పి. ఆర్. పి. లో ఎక్కువన్న విమర్శ కూడా ఉంది. వేగవంత మైన నిర్ణయాలు తీసుకోలేక పోతోంది. వీటి నుంచి బైట పడాల్సి ఉంది.


