| << Newer | Post Comments | Older >> |
ఒక పార్టీకి సంబందించిన విధాన నిర్ణయాలను ప్రకటించేది ఎవరు ? పార్టీ అధినేత లేదా ఆయన అనుమతితో పార్టీ అధికార ప్రతినిది. ఇది సహజంగా అన్ని పార్టీల్లో అమలవుతున్న పద్దతి. తెలుగుదేశం పార్టీ లో ఆ విధానం మారి నట్లుగా కనిపిస్తోంది. పార్టీ విధాన నిర్ణయాలను అధినేతకు బదులు పార్టీలోని సీనియర్ నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు వెల్లడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయే తప్ప ఇక నిర్ణయం తీసుకోలేదు. అలాగే కేంద్రం లో యు. పి. ఏ. ప్రభుత్వం నియమించిన ప్రణబ్ సారథ్యంలోని త్రిసభ్య కమిటీకి తన పార్టీ ది సమైక్యవాదమే నన్న వైఖరిని స్పష్టం చేస్తూ టి. డి. పి. అధినేత గతం లో రాసిన లేఖ విషయం లో ఇపుడు ఎం చేయాలన్నది కూడా ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక తెలంగాణ పై నిర్ణయం తీసుకున్న తరువాత తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీ లో బిల్లు పెట్ట్‌లలా వద్దా అన్నది కూడా పార్టీ విధాన నిర్ణయాల్లో ఒకటి. అలాగే తెలంగాణ ఏర్పాటు అయితే డళిత అభ్యర్థిని ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయం కూడా పార్టీ విధాన నిర్ణయల్లో ఒకటి అవుతుంది.
పార్టీలో సీనియర్ నేత, ఎం. పి. , పొలిట్ బ్యూరో సభ్యుడైన యెర్రబల్లి ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం తరువాత పార్టీ విధాన నిర్ణయాలను చెప్పడం చూస్తే యెర్రబల్లి చంద్రబాబు తో చర్చించి ఇవన్ని చెప్పారా? లేదా ఆయన వ్యక్తిగత అభిప్రాయామా?అన్నది అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టి. ఆర్. ఎస్. అధికారం లోకి వస్తే ముఖ్య మంత్రి పదవికి దళిత అభ్యర్థిని ఎంపిక చేస్తామని ప్రకటిస్తూ వస్తున్నారు. టి. ఆర్. ఎస్. తో పొత్తు కుదిరి మిత్రపక్షంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేసి అధికారం లోకి వస్తే కె. సి. ఆర్. చెబుతున్న విధంగా దళిత అభ్యర్థి గా కడియం శ్రీహరి పేరును సూచిస్తామని యెర్రబల్లి చెప్పడం చూస్తే ఇదంతా అంత తేలికగా జరిగే పనేనా అని అని పిస్తోంది. టి. ఆర్. ఎస్. తో పొత్తు కుదిరినా తెలంగాణా లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నే ముఖ్యమంత్రి అభ్యర్థిని రంగం లోకి దింపుతుంది. మిత్రపక్షమైన టి. డి. పి. ప్రతిపాదించే అభ్యర్థిని రంగం లోకి దింపుతుందా? ఇది అయ్యే పనేనా? తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకొని రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణాపై బిల్లు పెడతామని యెర్రబల్లి చెప్పడం కేవలం అవకాశ వాద రాజకీయం తప్ప మారేదీ కాదు అని చెప్పాలి. ఇక ప్రణబ్ కమిటీకి గతం లో ఇచ్చిన లేఖను వాపసు తీసుకొని తెలంగాణకు అనుకూలంగా మరో లేఖ ఇస్తామని చెప్పడం పార్టీ విధాన నిర్ణయం. దానిపై అధినేత చెబితే అధికారిక వార్త అవుతుంది. టి. ఆర్. ఎస్. ను తమ వైపు తిప్పుకోడానికి యెర్రబల్లి వ్యూహాత్మకంగా వ్యవహరించారా , కె. సి. ఆర్. పునరాలోచనలో పడేలా ఎత్తువేశారా ? ఇదంతా అధినేత వ్యూహాలో బాగమేనా ? లేదా ఎర్రబల్లి చంద్రబాబు ను ఇరుకున పెట్టేలా మాట్లాడారా అని అనుమానం కలుగుతోంది. యెర్రబల్లి చెప్పిన మాటలకు బాబు ఎం చెబుతారో చూడాలి మరి.


