| << Newer | Post Comments | Older >> |
తమకు విధానాలు చాలా ముఖ్యమని సి. పి. ఎం. రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు చెప్పారు. తమ పార్టీ విధానాలతో ఏకీభవించని పార్టీ ఎంత బలమైనదైన దాన్ని తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణా, సోషలిజం గురించి ప్రసంగిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత వాటికన్నా చాలా ముఖ్యమైన మాతతత్వం పై తమ పార్టీ విధానాన్ని స్పష్టం చేయాలని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ మాతతత్వానికి వ్యతిరేక మా? కదా? అన్నది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆది తమకు చాలా ప్రధానమని తెలిపారు. జాతీయ రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్, బి. జె. పి. లను ఓడించాలన్న లక్ష్య సాధనలో బాగంగా విధానాల పరంగానే తృతీయ కూటమిలో చేరాలని ఆహ్వానిస్తున్నామని రాఘవులు వివరించారు.


