| << Newer | Post Comments | Older >> |
గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం పై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కావటమే ప్రమాదానికి కారణమని రేల్‌వే అధికారులు చెబుతున్నా ఆది అంత నమ్మదాగినట్లు లేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. అదీ కాక రెండవాతరగతి భోగీలలో ఈ రకమైన ప్రమాదాలకు అవకాశం తక్కువని వారు ఆధారాలతో సహా చెబుతున్నారు. ఐతే విద్రోహ చర్య అనుకున్నా ఆ రకమైన ఛాయలు ఏవీ కనబడటం లేదని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. మరి ప్రమాదానికి కారణం ఏమీ అయి ఉంటుంది? ఎవరైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకుని వెల్లారా..? అన్న కోణం లో కూడా పరిషోదనలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఐతే ఈ ప్రమాదంలో ఆసక్తికరమైన, ప్రమాదకరమైన ఆంశం ఏమిటంటే.. సిమి కార్యకర్తలు ఎవరైనా ఈ సంఘటనకు పాల్పడ్డారా అన్నది కూడా ఖండించలేమని అధికారులు పేర్కొంటుండటం. దీనికి వీరు చెబుతున్న కారణం వింతగానే ఉన్నా కాదనలేకుండా ఉంది. ఏమిటంటే... నక్షల్స్ తో ఈ మద్య సిమి కార్యకర్తలు తిరుగుతున్నారు. రైలు పట్టాలు పేల్చేసే ఘనమైన చరిత్ర నక్షాల్స్‌కు ఉంది. వారే ఏమీ ఐన చేసి వున్డ వచ్చు. ద్వారాలు తెరుచుకోకుండా వారు ఏమీ ఐనాచేసారా అన్నది కూడా పరిశీలించాలి.. ఐతే ఇది జరగటానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి అని కూడా వీరు చెబుతున్నారు.


