| << Newer | Post Comments | Older >> |

పులివెందులలో మంగళవరంజరిగిన ఘటన పై ఈ నెల 24 వ తేదీలోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కులకమీషన్ ఛైర్మన్ జస్టిస్ శుభాషన్ రెడ్డి రాయల సీమ రేంజ్ ఐ. జి. ఠాకూర్ ను ఆదేశించారు. చిరంజీవి రాయలసీమ లో ప్రజా అంకిత యాత్ర ఏర్పాట్లు చూడటానికి వెళ్ళిన తమ పార్టీ సీనియర్ నేతలు , కార్య కర్తలపై మంగళవారం రాత్రి జరిగిన దాడి ఘటనపై ప్రజారాజ్యం పార్టీ ప్రతినిదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కలిసి పీర్యాదు చేశారు. రాష్ట్ర డి. జి. పి. కి కూడా వారు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకుల పై, వాహనాల పై దాడికి పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటన స్థలం లో ఉన్న పోలీసులు డాడీని నివారించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని వారి పై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.


