| << Newer | Post Comments | Older >> |
హైదరాబాద్ నగరంలో బుధవారం మధ్యాన్నం పోలీసులపై కాల్పులు జరిపి పరారైన వికారుద్దీన్ కు లష్కరే తోయిబా తో సంబందాలు ఉన్నట్లు సమాచారం . ఆ కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారుద్దీన్ అలియాస్ వికార్ డి. జి. ఎస్. మాజీ కార్యకర్త అని నగర కమిషనర్ ప్రసాదరావు స్పష్టం చేశారు. మలక్ పేట ప్రాంతానికి చెందిన వికారుద్దీన్ ఏడాదిగా తప్పించుకొని తిరుగుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సంతోష్ నగర్ ప్రాంతం లోని ఐ. ఎస్. సదన్ వద్ద వికార్ ఉన్నట్లు సమాచారం అందడం తో కౌంటర్ ఇంటెలిజెన్స్ కు చెందిన నలుగురు కానిస్టేబుల్స్ వారిని అదుపులోకి తీసుకోడానికి చేసిన ప్రయత్నం సందర్బంగా వికార్ అతని అనుచరులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ గురు రామరాజు కు కడుపులో బుల్లెట్ దూసుకెళ్లింది. జాఫర్ అనే మరో కానిస్టేబుల్ చితికి బులెట్ గాయం అయింది. పరారైన వికార్ సిమి ఏజెంట్ గా అనుమానిస్తునం పోలీసులు అతని కోసం గాలింపు జరుపుతున్నారు. జంటనగరాల సరిహద్దులను మూసివేశారు. గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి పరామర్శించారు.


