| << Newer | Post Comments | Older >> |
తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ సీటు కోసం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదుకాని మొత్తానికి యనమల పెట్టిన చిచ్చు మాత్రం పార్టీని దహిస్తోంది. టి. డి .పి. లో సమైక్య, వేర్పాటు అన్న రెండు వర్గాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు చంద్రబాబును ఇరుకున పెడుతున్నాయి. పార్టీలో ప్రస్తుతం నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న దేవేందర్ కు చెక్ పెట్టడానికి యనమల, ఎర్రం నాయుడు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న వదంతులు వినిపిస్తున్నాయి. తలసాని ని ముందుకు నెట్టి ఆ ఇద్దరు నేతలు వెనుకవ్యవహారం నడిపిస్తున్నారని వినికిడి. వారికి అధినేత ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని దేవేందర్ చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించారు. చివరికి అధినేత పై కూడా అనుమానం వ్యక్తం చేశారు. తనకే పాపం తెలియదని యనమల చెబుతుంటే ఎర్రం నాయుడు మాత్రం దేవేందర్‌గౌడ్ వ్యాఖ్యలను పిస రంత కూడా ఖండించలేదు. నాలుగు రోజులుగా పార్టీలోని పరిణామాన్ని గమనించిన చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశం లో అన్ని అంశాలను చర్చించారు. ఈ నెల 18 న తెలంగాణా పై పార్టీ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ సమావేశం లో అన్ని అంశాలను చర్చించాలని చెప్పి చంద్రబాబు తిరిగి తన మీ కోసం యాత్రను కొనసాగిస్తున్నారు. ఏ విషయం గురించైనా పార్టీలోనే చర్చించాలని, పత్రికలకు ఎక్కవద్దని చంద్రబాబు చేసిన సూచనలను పార్టీ నేతలు లెక్క చేయడం లేదు. పార్టీ లో తెలంగాణా అనుకూల , వ్యతిరేక వర్గాలు చిత్తాను సారం మాట్లాడుతున్నారు. అధినేత ఆదేశాలను పేద చెవిన పెడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణం లో పార్టీని కుమ్ంథున్న ఈ వివాదం చంద్రబాబును కాలాచి వేస్తోంది. దేవేందర్ గౌడ్ ను ఏమో చేస్తే ఆది ఎలా మలుపు తిరుగుతుందో అని మధన పడుతున్నారు. పార్టీ లోని కొందరు సీనియర్లకు చెక్ పెట్టడానికి యనమల చేస్తున్న ప్రయత్నాలకు బాబు పరోక్ష సహకారం ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చే నిదర్శనాలు పలు కనిపిస్తున్నాయి. పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు,గిరిజాల వెంకటస్వామి నాయుడు వంగా గీతా తదితరులు యనమల బాధితులే నని సమాచారం. యనమల వ్యవహారం తో విసిగి పోయిన వంగా గీతా చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్బం లోను దూరంగానే ఉన్నారు. మాజీ మంత్రి కళా వెంకట్రావు ద్వారా గీతను చంద్రబాబు పిలిపించి చాలాసేపు మంతనాలు జరిపారు.ఒకప్పుదు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షూరీలిగా పనిచేసిన గీత చంద్రబాబు తో తన మనసులోనే మాటలను చెప్పారు. పార్టీలో మహిళలను చిన్న చూపు చూస్తున్నారని పార్టీ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని వాపోయారు. జిల్లా లో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీకి ఎందుకు దూరం అవుతున్నారో గమనించాలని గీత చంద్రబాబుతో అన్నారని సమాచారం. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో పదవిని ఇవ్వడానికి చంద్రబాబు సుముకత చూపినా గీత దానిని తిరస్కరించి, పార్టీలో మహిళలకు తగిన గుర్తింపు దక్కితే చాలునని అన్నారని తెలిసింది.


