| << Newer | Post Comments | Older >> |
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి వాడి వేడిగా సాగనున్నాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలం లో మృతిచెందిన పార్లమెంట్ సభ్యులకు సభ సంతాపం తెలిపిన తరువాత స్పీకర్ సోమ్‌నాథ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం సభ సమావేశం కాగానే డి. ఎం. కె. పార్టీకి చెందిన ఎం. పి. లు శ్రీలంకలో జరుగుతున్న ఉచకోత పై చర్చకు పట్టు పట్టే అవకాశాలు కనిపిస్తోంది. శ్రీలంకలో తమిళ జన వాసాలపై జరుగుతున్న శ్రీలంక సైనిక చర్యను నిరసిస్తూ ఇప్పటికే డి. ఎం. కె. పార్టీ రాజ్య సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత కరుణానిధి కి రాజీనామా సమర్పించారు. శ్రీలంక సైనిక దాడి విష్యం లో కేంద్రం జోక్యం చేసుకొని పక్షం లో తమ పార్టీ ఎం. పి. లాందరు వారి పదవులకు రాజీనామాలు చేస్తారని కరుణానిధి ఇప్పటికే ప్రకటించారు. సోమవారం మరో కీలక అంశమైన అణు ఒప్పందం పై కూడా సభలో చర్చ జరిగే వీలుంది. కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల్లోని మత గర్షణలు, తెలంగాణా అంశం కూడా చర్చకు రావచ్చు. నవంబర్ 21 వ తేదీ దాకా మాత్రమే సమావేశాలు జరగనున్నాయి.


