| << Newer | Older >> |
on 2008/7/4 19:50:08
రాష్ట్రం లో మరో రెండు కొత్త పార్టీ లు పురుడు పోసుకోనుండటం తో ఇంకా పుట్టని ఆ పార్టీల బిడ్దలను చూడటానికి వీలైతే ముద్దా డా టా నికి ప్రస్తుత రాజకీయ పార్టీలు ఉబలాట పడుతున్నాయి. ముఢం అడ్డు రావడం తో కొత్త పార్టీల్లోకి వెళ్ళాలానుకున్న నేతలు కాస్త నీ ర సించి పోయారు. మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఒక ప్రాంతీయ పార్టీ, టి. ది.పి. నుంచి బైటకు వచ్చిన దేవేందర్ గౌడ్ పెట్టనున్న తెలంగాణా ఉప పార్టీల్లో చేరడానికి చాలా మంది ఆసక్తి తో ఉన్నారు. ఈ దెండింటిలో చిరంజీవి పార్టీలోకి పెద్ద సంఖ్యలో వలసలు ఉంటుందని అంటున్నారు. కొత్త పార్టీలోకి వెళ్లే విషయం లో ప్రస్తుతం ఉన్న పార్టీల్లోని సీనియర్లు వలసలు వెళ్లే సంఖ్య పరిమితంగానే ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పోతే ఆగస్ట్ ఎనిమిదో తేదీ వరకు మంచి రోజులు లేవని పండితులు చెబుతున్నారు. దాంతో దేవేందర్ గౌడ్ తన కొత్త పార్టీ ఏర్పాటును ఆగస్ట్ కు వాయిదా వేసుకున్నారు. ఈ వలసల వల్ల టి. డి. పి. కి ఎక్కవగా దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. మంచి రోజు వచ్చే వరకు ప్రస్తుత పార్టీ లోనే కొనసాగాలని కూడా రాజకీయ నేతలు ఆలోచిస్తున్నారు. మరో పక్క చిరు ట్రైన్‌లో బెర్త్ కోసం రిజర్వ్ చేసుకోడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల సీజన్ లో పార్టీల ఫిరాయింపులు జోరుగానే ఉంటాయని చెబుతున్నారు. ప్రస్త్తం రాష్ట్రం లోని రెండు ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్ , తెలుగుదేశం లకు దీటుగా ఎదగాలని చిరంజీవి పార్టీ వ్యూహాలు రూపొందిస్తుంది. ఇక తెలంగాణాలో ఇప్పటికే బల పడిన టి. ఆర్. ఎస్. కు పోటీగా తెలంగాణాకే పరిమిత మౌతున్న దేవేందర్ పార్టీ ఆవిర్భావం వల్ల తమకేమీ నష్టం లేదని పైకి కె. సి. ఆర్.. చెబుతున్న ఆయన పార్టీనుంచి వలస వచ్చే వారిని చేర్చుకోడానికి దేవేందర్ సిద్దంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం తాము కొనసాగుతున్న పార్టీల్లో తమ పరిస్థితి మెరుగు పడదని బావిస్తున్న వారు, రానున్న ఎన్నికల్లో టిక్కెట్ రాదు అని అనుకుంటున్న వారు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త పార్టీల్లో చేరడానికి సిద్దం అవుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




