| << Newer | Older >> |
on 2008/9/11 0:06:56
తన రేణిగుంట పర్యటనలో సోనియా గాంధీ తిరుపతి పై వరాల జల్లు కురిపించారు. గురువారం రేణిగుంట లో జరిగిన మహిళా సాధికారిక సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. స్వయం సహాయక మహిళా బృందాలతో ఆమె ముఖాముఖి సంభాషణ జరిపారు. తన ప్రసంగంలో బాగంగా చివరిలో ఆమె తిరుపతి కి వరాలను ప్రకటించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేంద్రం లోని యు. పి. ఏ. ప్రభుత్వం అధిక ప్రధాన్యతను ఇస్తోందని దాదాపు 2000 కోట్ల రూపాయల వ్యయం తో తిరుపతి రైల్వే స్టేషన్ ను అన్ని రకాలుగా ఆధునీకరించనున్నట్లు చెప్పారు. తిరుపతి లో 300 పడకల చిల్డ్రన్స్ ఆసుపత్రి ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. శ్రీవేంకటేశ్వర మెడికల్ సైన్స్ ను ఆధునీకరించనున్నామని, తిరుపతి విమానాశ్రయ స్థాయిని పెంచి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



