| << Newer | Older >> |
on 2008/10/5 5:52:20
వారిద్దరి లక్ష్యం ఒక్కటే. అయితే దాన్ని సాదించుకోడానికి వారు ఎన్నుకున్న మార్గాలే వేర్వేరు. తెలంగాణా అంశం విషయం లో మొన్నటిదాకా తనకే పేటెంట్ హక్కు ఉందన్న విధంగా వ్యవహరిస్తూ వచ్చినతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. సి. ఆర్. చివరికి తెలంగాణాను సాదించుకోడానికి మొదటి నుంచి సమైక్య వాదాన్ని వినిపించి అవసరం కొద్దో తప్పని సరి పరిస్థితుల్లో తెలంగాణాకు అనుకూల నిర్ణయం తీసుకున్న వారితో పొత్తులు పెట్టుకొని రానున్న ఎన్నికల్లో అధికారం పొంది తెలంగాణాను సాదించుకోవాలని తపిస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించాలన్న పట్టుదల తో జాతీయ స్థాయిలో బావసారూప్యత కలిగిన పార్టీల మద్దతుకూడగట్టడానికి డిల్లీ లో ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా వాదులంత ఒక తాటి పైకి తెచ్చి ఉద్యమం ద్వారానే తెలంగాణా సాదించాలని నవ తెలంగాణా ప్రజా పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ యత్నిస్తున్నారు. అధికారం ద్వారానే తెలంగాణా సాద్యం అన్నది కె. సి. ఆర్. వాదన. ఇక సమైక్య వాదులతో చర్చలు జరిపి వారి మనసు మార్చి వారిని కూడా తెలంగాణకు ఒప్పించాలన్న పట్టుదల కె. సి. ఆర్. లో ఉంది. ఆయన ఆదివారం సమైక్య వాద పార్టీ అయిన సి. పి. ఎం. పార్టీ జాతీయ నేతలతో చర్చలు జరిపి చివరకు వారిని ఒక దారికి తీసుకొని రాగలిగారు. తెలంగాణకు తాము అడ్దంకి కాబోమని మాత్రం వారితో హామీని పొందగలిగారు. జాతీయ స్థయిలోగాని, రాష్ట్రంలోగాని కాంగ్రెస్ ఓడించడమే తమ ప్రధాన్య మని సి. పి. ఎం చెబుతోంది. కాంగ్రెస్ ఉయతిరేకించే పార్టీలతో కలిసి పనిచేయడానికి సి. పి. ఎం సిదం అవుతోంది. సమైక్య వాదాన్ని కొంచెం పక్కన పెట్టి టి. ఆర్. ఎస్. విజ్ఞప్తిని పరికిస్తోంది. తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలమన్న సంకేతాలు అందితే కాంగ్రెస్ పై వత్తిడి పెరుగుతుందని కుడ్ కె. సి. ఆర్. బావిస్తున్నారు. అప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే తెలంగాణా విషయం లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన అనుకుంటున్నారు. కె. సి. ఆర్. చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణా వాదులకు సుతరం ఇష్టం లేదు. కె.సి. ఆర్. వైఖరిని వారు తప్పు పడుతున్నారు. సమైక్య వాదులతో చేతులు కలపడం తెలంగాణా వాదులకు నచ్చడం లేదు.
తెలంగాణా వాదుల మనోబావాలను పసిగట్టిన దేవేందర్ గౌడ్ వారిని తన వైపునకు తిప్పుకోడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో బాగంగా గౌడ్ తెలంగాణా వాదులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 11 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణా వాదులతో పాటు తెలంగాణా ప్రజాసమితి పార్టీ అదినేత కె. సి. ఆర్. ను కూడా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలోని తెలంగాణా వాదులు, తెలంగాణా పార్టీలు, మేధావులు, అందరు కలిసి కట్టుగా పోరాడితే ఉద్యమాలు నడిపితే తెలంగాణా వచ్చి తీరుతుందన్నది దేవేందర్ గౌడ్ వాదన. అధికారం మాట మరిచి తెలంగాణాకోసం ఉద్యమించాలని గౌడ్ అంటున్నారు. టి. ఆర్. ఎస్. ఒక పక్క టి. డి. పి. తో, మరోపక్క పి. అర్.పి. తో పొత్తులకోసం పాకూలాడటం కన్నా తెలంగాణా సాధన కోసం తెలంగాణా లోని పార్టీలనాన్నిటిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఫ్రంట్ ను ఏర్పాటు చేసి పోరాడితే మంచి ఫలితం ఉంటుందని దేవేందర్ అభిప్రాయపడుతున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



