| << Newer | Post Comments | Older >> |
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పక్ష పార్టీల సభ్యులు వ్యవహరిస్తున్న తీరు పై రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అయినా ప్రతిపక్ష సభ్యులు సభ సజావుగా నడవడానికి సహకరిస్తారని తాను పెట్టుకున్న ఆశ నిరాశ అయిందని అన్నారు. సభలో ప్రజాసమస్యలపై చర్చించడానికి , చట్టాలు చేయడానికి బదులు వాకౌట్లకు, అనవసర అంశాలను ముచ్చటిస్తూ సభ సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. సభలో ఒకటి, రెండు ప్రశ్నల తరువాత సభ ముందుకు సాగడం లేదని అన్నారు. గత రెండు రోజులు గా సభ నడుస్తున్న తీరు గమనిస్తే ఉద్దేశ్య పూర్వకంగా గొడవ రేపి వాకౌట్లు చేస్తూ సభ సమయాన్ని హరిస్తున్నారని అభిప్రాయ పడ్డారు. సభ పెట్టమని కోరే ప్రతిపక్షాలు సభలో ప్రజా సమస్యలు చర్చించడానికి బదులు చొక్కలు మడిచి యాగి చేస్తున్నాయని విమర్శించారు.


