| << Newer | Post Comments | Older >> |
కేంద్ర మంత్రి వర్గం రేపు సమావేశం కానుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న సమావేశం లో అణు ఒప్పందం విషయం పై చర్చించనున్నట్లు తెలిసింది. బుధవారం జరిగిన యు.పి.ఎ, లెఫ్ట్ సమన్వ్యయ కమిటీ సమావేశం లోని పరిణామాలు, లెఫ్ట్ వైఖరి, అణు ఒప్పందం, అణు శక్తి సంస్థతో జర్పాల్సిన చ్యార్చలా గురించి కూడా మంత్రివర్గ సమావేశం లో చర్చకు రానుంది. జపాన్ లో జరగనున్న ఐ. ఏ. ఈ. ఏ. సమావేశానికి ప్రధాని హాజరు కావాల్సి ఉంది. అణు ఒప్పందం విషయం లో తన వైఖరిని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. అణు ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశాలన్నిటి పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది క్యాబినెట్ మీట్ లో చర్చిచనున్నారు.


