| << Newer | Post Comments | Older >> |

రాష్ట్ర శాసన సభ బుధవారానికి వాయిదా పడింది. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరల తగింపు కోసం విపక్ష పార్టీలు సభ లో ఆందోళనకు దిగాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీల నేతలంతా ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీ గా బయలు దేరి నెక్లెస్ రోడ్డు లో విపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి. ధర్నాలో పాల్గొనడానికి వెళుతున్న సి. పి. ఎం. రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులును పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నా చేస్తున్న విపక్ష పార్టీల ప్రధాన నేతలను కూడా అరెస్ట్ చేశారు. దీని పై అసెంబ్లీ లో విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. రాష్ట్ర హోం మంత్రిని సభకు రప్పించి ఒక ప్రకటన చేయించాలని పట్టుపట్టాయి. స్పీకర్ స్థానం లో ఉన్న కుతూహాలమ్మ ఎంత సర్ది చెప్పినా వినలేదు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకొని వెళ్ళడం జరిగింది. దాంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు .


